ఐఐఎఫ్‌టీ ఆఫర్ చేసే కోర్సుల వివరాలను తెలపండి?
- మోహన్, నిజామాబాద్.
Question
ఐఐఎఫ్‌టీ ఆఫర్ చేసే కోర్సుల వివరాలను తెలపండి?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)కు న్యూఢిల్లీ, కోల్‌కతాలలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సును అందిస్తుంది.
అర్హత: గ్రాడ్యుయేషన్
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ వంటి నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి.
అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి కోర్సులను కొన్ని రకాల సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లను కూడా ఐఐఎఫ్‌టీ ఆఫర్ చేస్తుంది.