Skip to main content

నేను తెలుగు మీడియంలో చదివాను. పోటీ పరీక్షల్లో ఇంగ్లిష్ విభాగంలో స్సెల్లింగులు, యాంటోనిమ్స్, సినానిమ్స్ విషయాల్లో నేను పొరపాట్లు చేస్తున్నాను....

-బి.శశికాంత్, కూకట్పల్లి
Question
నేను తెలుగు మీడియంలో చదివాను. పోటీ పరీక్షల్లో ఇంగ్లిష్ విభాగంలో స్సెల్లింగులు, యాంటోనిమ్స్, సినానిమ్స్ విషయాల్లో నేను పొరపాట్లు చేస్తున్నాను. వీటిపై పట్టు సాధించడానికి ఎలా చదవాలి?
 ఇంగ్లిష్లో స్పెల్లింగ్స్ అనేవి చాలా సంక్లిష్టమైనవి. ఇవి ప్రతిసారి ఉచ్ఛరించే విధానానికి అనుగుణంగా ఉండవు. అందువల్ల వీటిని జాగ్రత్తగా, ఏకాగ్రతతో నేర్చుకోవాలి. ఒక పదం స్పెల్లింగ్ గురించి తెలుసుకునేటప్పుడు దాని ఉచ్ఛారణా పద్ధతిని పక్కనబెట్టి పూర్తిగా అక్షరాలపైనే దృష్టి సారించాలి. వీటిని నేర్చుకోవడానికి ఆంగ్లంలో కొన్ని నియమాలు ఉన్నప్పటికీ రాయడం ద్వారా వీటిపై పట్టు సాధించడమే ఉత్తమ విధానం. ఇంగ్లిష్ పత్రికలు, మేగజీన్ల లాంటివాటిని చదువుతున్నప్పుడే కొత్త పదాలను గుర్తించి వాటి స్పెల్లింగ్, అర్థాలు, వెర్బ్, అడ్వెర్బ్ రూపాలు, సినోనిమ్స్, యాంటోనిమ్స్ నేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో ఆంగ్ల పదాలకు సంబంధించి ఇచ్చే అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. 

 ఉదా: Brake, Break; Vapour,Vaporisation

Photo Stories