Skip to main content

బ్యాంకుల్లో ఖాళీలను సాధారణంగా ఏవిధంగా భర్తీ చేస్తారు?

Question
బ్యాంకుల్లో ఖాళీలను సాధారణంగా ఏవిధంగా భర్తీ చేస్తారు?
దేశంలోని అన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియలో సాధారణంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనే దశలు ఉంటాయి. కొన్ని బ్యాంకుల్లో గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటుంది. గతంలో అన్ని బ్యాంకులు.. వేటికవే సొంతంగా రిక్రూట్‌మెంట్‌ నిర్వహించుకునేవి. దీంతో ఒకే రోజు రెండు బ్యాంకుల పరీక్షలు రావడం, ఆర్థికంగా కూడా ఉద్యోగార్థులకు భారం కావడంతో ఇటీవలి ఐబీపీఎస్‌ కామన్‌ రిటెన్‌ ఎగ్జామ్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు. దీనిద్వారా 19 ప్రభుత్వరంగ బ్యాంకులు నియామకాలు చేపడుతున్నాయి. ఈ పరీక్ష ఆధారంగా నియామకం చేపట్టే బ్యాంకుల జాబితాలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దాని అసోసియేట్‌ బ్యాంకులు లేవు. ఇవి సొంతంగా రిక్రూట్‌ చేసుకుంటాయి.

Photo Stories