Skip to main content

ఐబీపీఎస్‌ పీఓ పరీక్ష ఏ విధంగా ఉంటుంది?

Question
ఐబీపీఎస్‌ పీఓ పరీక్ష ఏ విధంగా ఉంటుంది?
ఐబీపీఎస్‌ పీఓల భర్తీ కోసం నిర్వహించే కామన్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌లో మొత్తం అయిదు సెక్షన్లు ఉంటాయి. అవి..రీజనింగ్‌(మార్కులు-50); ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(మార్కులు-25); క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌(మార్కులు-50); జనరల్‌ అవేర్‌నెస్‌ (మార్కులు-50); కంప్యూటర్‌ నాలెడ్జ్‌ (మార్కులు-50); కాలవ్యవధి: రెండున్నర గంటలు. 60 నిమిషాల వ్యవధిలో 25 మార్కులకు ఇంగ్లిష్‌ కాంపోజిషన్‌పై డిస్క్రిప్టివ్‌ పరీక్ష కూడా ఉంటుంది. ఎస్సే రైటింగ్‌, ప్రెసిస్‌ రైటింగ్‌, లెటర్‌ రైటింగ్‌ తదితర ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఆబ్జెక్టివ్‌ పరీక్షలోని అయిదు సెక్షన్లకు వేర్వేరుగా కటాఫ్‌ నిర్ణయిస్తారు. ప్రతి సెక్షన్‌లోనూ కటాఫ్‌ దాటితేనే ఆ అభ్యర్థి రాసిన డిస్క్రిప్టివ్‌ పేపర్‌ను మూల్యాంకనం చేస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానాన్ని కూడా అమలు చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి అప్పటికే పొందిన మార్కుల నుంచి 0.25 మార్కులను తీసేస్తారు.

Photo Stories