Skip to main content

ఐబీపీఎస్‌ పీఓ, క్లరికల్ కేడర్‌ కోసం నిర్వహించే పరీక్షల మధ్య తేడా? రిఫరెన్స్‌ పుస్తకాలను తెలపండి?

Question
ఐబీపీఎస్‌ పీఓ, క్లరికల్ కేడర్‌ కోసం నిర్వహించే పరీక్షల మధ్య తేడా? రిఫరెన్స్‌ పుస్తకాలను తెలపండి?
ఐబీపీఎస్‌ నిర్వహించే ప్రవేశ పరీక్షలో విజయం సాధించడానికి ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, రీజనింగ్‌లలో నైపుణ్యం కీలకం. క్లరికల్‌, పీఓ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలో దాదాపుగా సబ్జెక్టులు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ప్రశ్నపత్రం క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. పీఓ ఉద్యోగాలకు జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కలిపి ఉంటే.. క్లరికల్‌ ఉద్యోగాలకు బ్యాంకింగ్‌ రంగ నేపథ్యంలో జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ వేర్వేరుగా ఉంటాయి.

రిఫరెన్స్‌ బుక్స్‌:
ఇంగ్లిష్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌-హరిమోహన్‌ ప్రసాద్‌
ఇంగ్లిష్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ - ఎ.కె. కపూర్‌
ఆబ్జెక్టివ్‌ అర్థమెటిక్‌ - ఎస్‌.ఎల్‌ గులాటీ
న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ బ్యాంకింగ్‌-దిల్హాన్‌ పబ్లికేషన్స్‌
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ సఫీషియన్సీ-కిరణ్‌ పబ్లికేషన్స్‌
నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ - ప్రభాత్‌ జావేద్‌
అనలిటికల్‌ రీజనింగ్‌ - ఎం.కె. పాండే
వెర్బల్‌ రీజనింగ్‌ - ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌

Photo Stories