Skip to main content

పోటీ పరీక్షల్లో పార్లమెంట్ కు సంబంధించి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారో తెలపండి.

- ఆర్. నవీన, కొత్తపేట.
Question
పోటీ పరీక్షల్లో పార్లమెంట్ కు సంబంధించి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారో తెలపండి.
ప్రతి పోటీ పరీక్షలోనూ పార్లమెంట్‌పై తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల దీనికి సంబంధించి లోతుగా అధ్యయనం చేయాలి. భారత పార్లమెంట్‌ను విదేశీ పార్లమెంట్లతో పోల్చి చదవాలి. అదేవిధంగా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభను తులనాత్మకంగా అధ్యయనం చేయాలి. వివిధ లోక్‌సభలు, వాటి ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు, వాటి ప్రత్యేకతలు, అధికారంలోకి వచ్చిన పార్టీలు, వివిధ రాజకీయ సమీకరణాలకు సంబంధించిన అవగాహన ఉండాలి. వివిధ లోక్‌సభల్లో వివిధ కులాలు, మతాలు, మహిళలకు లభించిన ప్రాతినిధ్యాన్ని పరిశీలించాలి. ఓటింగ్ సరళి, పోలింగ్ శాతం తదితర అంశాలపైనా ప్రశ్నలు అడగవచ్చు.

Photo Stories