Skip to main content

OU: ఇంజనీరింగ్‌ కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు

Osmania University క్యాంపస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో కొత్తగా ప్రవేశపెట్టిన మూడు కోర్సులకు AICTE గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపాల్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ జూలై 8న తెలిపారు.
OU
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు

ఈ విద్యాసంవత్సరం నుంచి BTech, M.Tech కోర్సుల్లో ప్రవేశపెట్టిన మైనింగ్‌ ఇంజనీర్, ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ విభాగాలకు కొత్తగా గుర్తింపు లభించగా 6 బీటెక్, 18 ఎంటెక్‌ కోర్సులకు అనుమతి పొడిగించినట్లు చెప్పారు. ఇకపై గేట్‌ అర్హతతో కాలేజీలో ఎంటెక్‌లో ప్రవేశం పొందే వారికి AICTE ఉపకార వేతనాలు లభిస్తాయన్నారు. ఈసీఈలో సీట్ల సంఖ్యను 50 నుంచి 60కి, బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ (BME)లో 30 నుంచి 40కి పెంచామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌లో బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు BMEలో ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

చదవండి: 

Published date : 09 Jul 2022 04:19PM

Photo Stories