Skip to main content

APECET Results 2023 Date: జూన్‌ 23న ప్రాథమిక కీ... ఫలితాలు ఎప్పుడంటే!!

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిటెక్నిక్, బీఎస్సీ(గణితం) ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్‌–23 పరీక్షను జూన్‌ 20న ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.
APSCHE
ఏపీ ఈసెట్‌ పరీక్ష సమాచారం

రాష్ట్రవ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,640 మంది బాలు­రు, 9,615 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు.

Career after polytechnic: పాలిటెక్నిక్‌తో.. అద్భుత అవకాశాలు

ఉద­యం సెషన్‌లో అగ్రికల్చరల్, సిరామిక్‌ టెక్నాలజీ, సివిల్‌ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, కెమికల్, బీఎస్సీ(గణితం) ఈఈఈ విభాగాలకు, మధ్యా­హ్నం సెషన్‌లో ఈసీఈ, ఈఐఈ, మెకానికల్‌ మెటలర్జికల్, మైనింగ్‌ ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల పరీక్ష నిర్వహిస్తారు.

AP ECET 2023 Key and Results

జూన్‌ 23న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జూలై మొదటి వారంలో ఫలితాలు వి­డుదల చేస్తామని ఈసెట్‌–2023 చైర్మన్, జేఎన్‌టీయూకే వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు జూన్‌ 19న  తెలిపారు. ఫలితాలను విడుదల చేసిన వెంటనే https://results.sakshieducation.comలో చూసుకోవచ్చు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు 8500404562 హెల్ప్‌లైన్‌ నంబరు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Integrated B.Tech Courses After 10th: పదితోనే.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

Published date : 20 Jun 2023 05:12PM

Photo Stories