EAMCET: ఎంసెట్ షెడ్యూల్ విడుదల
వర్సిటీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీసీ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆన్‌లైన్ విధానంలో ఎంసెట్ దరఖాస్తులను మార్చి 3 నుంచి స్వీకరిస్తామని, ఏప్రిల్ 10లోగా అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్‌లో 5 జోన్లు (కర్నూలు విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు) ఏర్పాటు చేశామన్నారు. ఎంసెట్ ప్రక్రియ పూర్తయ్యేలోగానే అనుబంధ కాలేజీలకు అఫ్లియేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
ఈసారి నర్సింగ్ కూడా..
నర్సింగ్ కోర్సుల సీట్లను కూడా ఈసారి ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు వర్సిటీ నుంచి అనుమతి వచి్చందన్నారు. ఎంసెట్‌కు ఇంటర్‌లో (జనరల్ 45 శాతం, రిజర్వేషన్ కేటగిరీకి 40 శాతం) కనీస మార్కులు సాధించాలనే నిబంధన అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎంసెట్‌లో ఇంటర్‌కు వెయిటేజీ తొలగించినట్టు ప్రకటించారు. వెయిటేజీ విధానం కష్టసాధ్యమవ్వడం, జాతీయ పరీక్షల్లోనూ దీన్ని అనుసరించకపోవడంతో తీసివేశామన్నారు. ఫస్టియర్ ఇంటర్ నుంచి 70 శాతం, సెకండి యర్ నుంచి వంద శాతం సిలబస్ ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డా.శ్రీనివాస్, ఎంసెట్ కనీ్వనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు.
చదవండి: EAMCET 2023: ఎంసెట్.. టాప్ స్కోర్ ఇలా!
ఇదీ ఎంసెట్ షెడ్యూల్
28.2.2023 |
నోటిఫికేషన్ విడుదల |
3.3.2023 |
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలు |
10.4.2023 |
అపరాధ రుసుం లేకుండా దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు |
12–14.4.2023 |
ఆన్‌లైన్ ఎడిట్ ఆప్షన్స్ |
15.4.2023 |
రూ. 250 లేట్ ఫీజుతో దరఖాస్తుకు గడువు |
20.4.2023 |
రూ. 500 లేట్ ఫీజుతో దరఖాస్తుకు గడువు |
25.4.2013 |
రూ. 2,500 లేట్ ఫీజుతో దరఖాస్తుకు గడువు |
2.5.2023 |
రూ.5 వేల లేట్ ఫీజుతో దరఖాస్తుకు గడువు |
30.4.2023 |
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ |
7–9.5.2023 |
ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ పరీక్ష (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు) |
10,11.5.2023 |
అగ్రి, మెడికల్ ఎంసెట్ పరీక్ష |
ఫీజు వివరాలు..
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500
ఇతరులకు రూ.900
ఇంజనీరింగ్, మెడికల్ రెండు ఎంసెట్‌లు రాసే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.1,000
రెండూ రాసే ఇతరులకు రూ.1,800