Skip to main content

TS Teachers Promotions and Transfers : ఈ నిబంధ‌న‌ల‌కు లోబడే టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను కోర్టు తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ‌స్టు 31వ తేదీన(గురువారం) ఆదేశించారు.
Telangana Education Department Developments, Aug 31 Orders ,TSteachers promotion and transfers news 2023,Education Minister Sabitha Indra Reddy,
ts teachers promotion and transfers news 2023 telugu news

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు.

ts education minister sabitha indra reddy telugu news

 ఈ సంద‌ర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. పూర్తి పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా  పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాల‌న్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ తరఫున వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపాల‌న్నారు. ఆన్‌లైన్‌ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు.

☛ TS DSC 2023 Notification Date : ఆ తర్వాతే టీఎస్ డీఎస్సీ పూర్తి నోటిఫికేషన్ విడుద‌ల‌..! ఆన్‌లైనా..? ఆఫ్‌లైనా.? ఏది బెట‌రంటే..?

ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల‌న్నారు. జిల్లాల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారాలను ఆయా జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాల‌న్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సాఫీగా జరిగేలా చూడాలని మంత్రి సబితా ఆదేశించారు.

చదవండి: TS DSC Notification 2023: జిల్లాల వారీగా టీచర్‌ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే

Published date : 01 Sep 2023 08:18AM

Photo Stories