Skip to main content

Free DSC 2024 Study Material: స్టడీ మెటీరియల్‌కు ఆర్థిక సహాయం.. దరఖాస్తులుకు చివ‌రి తేదీ ఇదే..

మంచిర్యాల టౌన్‌: ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ నియామకం కోసం పరీక్షలకు హాజరయ్యే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు బుక్‌ఫండ్‌/స్టడీ మెటీరియల్‌ ఖర్చులు అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి వినోద్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
DSC 2024 Study Material

10 వేల మంది బీసీ అభ్యర్థులకు రూ.1,500 చొప్పున అందిస్తామని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో www.tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఏప్రిల్‌ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని, 08732–221280, 9949684959 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

చదవండి: డీఎస్సీ - టెట్‌ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్

Published date : 15 Mar 2024 04:01PM

Photo Stories