Skip to main content

T20 World Cup: ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్!

స్కాట్లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
Scotland Earn Maiden ICC Womens T20 World Cup Berth

మే 5వ తేదీ జరిగిన క్వాలిఫయర్‌ సెమీస్‌లో స్కాట్లాండ్‌ ఐర్లాండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. 2015 నుంచి వరల్డ్‌కప్‌ బెర్త్‌ కోసం తపిస్తున్న స్కాట్లాండ్‌ ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) అనుకున్నది సాధించింది. 

మరో సెమీస్‌లో యూఏఈని ఓడించిన శ్రీలంక కూడా స్కాట్లాండ్‌తో పాటు వరల్డ్‌కప్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ రెండు జట్లు క్వాలిఫయర్‌ పోటీల నుంచి ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. 

World Record: స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ డుప్లాంటిస్ ప్రపంచ రికార్డు

టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌ వేదికగా అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్‌, పాక్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లతో కలిసి గ్రూప్‌-ఏలో.. స్కాట్లాండ్‌.. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌తో కలిసి గ్రూప్‌-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.

గ్రూప్‌ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని జట్టుతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్‌ రెండు జట్లు అక్టోబర్‌ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్‌ 20న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న జరుగనుంది.

Dommaraju Gukesh: చదరంగానికి మన దేశం నుంచి వచ్చిన తెలుగు కుటుంబానికి చెందిన చిచ్చరపిడుగు ఇత‌నే!!

Published date : 06 May 2024 04:52PM

Photo Stories