Skip to main content

New Opportunities with Artificial Intelligence in India: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో భారత్‌లో కొత్త అవకాశాలు

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికత భారత్‌లో కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుందని అంతర్జాతీయ జాబ్‌ సైట్‌ ఇండీడ్‌ నివేదిక తెలిపింది.
India's job market benefiting from AI advancements, Indeed report on AI's impact in India,New Opportunities with Artificial Intelligence in India, AI tech creating job opportunities in India,AI technology opens doors for employment in India
New Opportunities with Artificial Intelligence in India

వచ్చే అయిదేళ్లలో ఏఐ నూతన ఉద్యోగాలను సృష్టిస్తుందని సర్వేలో పాలుపంచుకున్న 85 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయని వెల్లడించింది. ‘ఏఐ రాకతో ఉద్యోగుల పనుల స్వభావాన్ని మెరుగుపరుస్తుందని 85 శాతం సంస్థలు ఆశిస్తున్నాయి. ఉద్యోగ భద్రత, ఉద్యోగులకు కెరీర్‌ అభివృద్ధికి అవకాశాలను మెరుగుపరుస్తుందని 77 శాతం కంపెనీలు విశ్వసిస్తున్నాయి.

India Ai MOU with Meta: కొత్త టెక్నాలజీ దిశగా ఏఐ.. మెటాతో జట్టు

63 శాతం మంది ఉద్యోగార్ధులు ఏఐ ప్రభావం గురించి తాము సంతోషిస్తున్నామని చెప్పారు. ఈ నూతన సాంకేతికత మరిన్ని ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని 53 శాతం మంది అంగీకరించారు’ అని సర్వే తెలిపింది. అంతర్జాతీయంగా ఏడు మార్కెట్లలో ఇండీడ్‌ తరఫున సెన్సస్‌వైడ్‌ నిర్వహించిన ఈ సర్వేలో 7,275 కంపెనీలు, ఉద్యోగులు పాలుపంచుకున్నారు. ఇందులో భారత్‌ నుంచి 1,142 కంపెనీలు, అభ్యర్థులు ఉన్నారు.

Elon Musk New AI Firm xAI: చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇవ్వనున్న ఎలాన్‌ మస్క్‌ కొత్త కంపెనీ ‘AI’

భారత్‌లో ఇలా..

భారతీయ ఉద్యోగార్ధులు ఏఐ సిస్టమ్స్, టూల్స్‌ సంభావ్య ప్రయోజనాలను స్వీకరిస్తున్నప్పటికీ వారికి కూడా ఆందోళనలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్‌ అవసరమని 43 శాతం, వారు పనిచేస్తున్న రంగం లేదా వృత్తిలో సంభావ్య ఉద్యోగ నష్టాలు ఉండొచ్చని 29 శాతం మంది అభిప్రాయపడ్డారు.

హెచ్‌ఆర్‌/టాలెంట్‌ అక్విజిషన్‌ లీడర్లలో ఏఐ సిస్టమ్స్, టూల్స్‌ తమ పనిని సులభతరం చేస్తాయని 90 శాతం, నియామకం, అభ్యర్థుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని 86 శాతం మంది నమ్ముతున్నారని వివరించింది. ఏఐ సిస్టమ్స్, టూల్స్‌ తమ ఉద్యోగానికి సంబంధించిన మరింత మానవ అంశాలపై దృష్టి పెట్టేందుకు వీలు కల్పిస్తాయని దాదాపు 81 శాతం కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. కంపెనీలు, ఉద్యోగులు ఏఐపై అత్యంత ఆశాభావంగా ఉన్నారని తెలిపింది. 98 శాతం హెచ్‌ఆర్‌ నిపుణులు, 91 శాతం ఉద్యోగార్ధులు ప్రస్తుతం పని కోసం ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నారని నివేదిక వివరించింది.

Artificial intelligence: శ్వాస, జన్యు రుగ్మతలను త్వరగా పసిగట్టే ఏఐ

Published date : 16 Oct 2023 08:54AM

Photo Stories