Skip to main content

Telangana Geetham: తెలంగాణ రాష్ట్ర గీతం రెడీ.. దీని విడుద‌ల ఎప్పుడంటే..?

ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రానికి స్వంత రాష్ట్ర గీతం రెడీ అయ్యింది.
Telangana State Anthem Jaya Jaya He Telangana to be Released Soon

ప్రముఖ కవి అందెశ్రీ రచించిన "జయ జయహే తెలంగాణ" గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేసింది ప్రభుత్వం. ఈ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచారు. అయితే, గతంలో రచించిన ఈ గీతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులను కూడా అందెశ్రీ చేశారు.

రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ఇప్పటివరకు రాని గీతం ఈ ఏడాది జూన్ 2వ తేదీ విడుదల కానుంది.

గీతం ఎలా ఉంటుంది?
➢ ప్రముఖ కవి అందెశ్రీ రచించిన "జయ జయహే తెలంగాణ" అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేశారు.
➢ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను గీతంలో ప్రస్తావించారు.
➢ ఒకటిన్నర నిమిషం నిడివిలో ఉండే ఈ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచారు.

మార్పులు ఏమిటి?
➢ అందెశ్రీ రాసిన మాములు గీతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని మార్పులు చేశారు.
➢ రాష్ట్ర ఉద్యమం గురించి మరింత స్పష్టంగా తెలియజేసేలా కొన్ని పంక్తులు చేర్చారు.

Bio Asia Summit: రూ.లక్ష కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి.. 5 లక్షల మందికి ఉద్యోగాలు

ఎప్పుడు, ఎక్కడ విడుదల చేస్తారు?
➢ జూన్ 2వ తేదీ రాష్ట్ర పదేళ్ల వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గీతాన్ని విడుదల చేస్తారు.
➢ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించారు.

➢ రాష్ట్రానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో ఈ గీతాన్ని ఆలపించనున్నారు.

Published date : 23 May 2024 12:19PM

Photo Stories