Skip to main content

PM inaugurates Global Maritime India Summit 2023: గ్లోబల్‌ టూరిజం హబ్‌గా భారత్‌

విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
"Key Projects Launched , PM inaugurates Global Maritime India Summit 2023,Virtual Inauguration by PM Modi in Visakhapatnam
PM inaugurates Global Maritime India Summit 2023

అలాగే కంటైనర్‌ టెర్మినల్‌ విస్తరణ ఫేజ్‌–2ను జాతికి అంకితం చేశారు. ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ మారిటైం ఇండియా సమ్మిట్‌–2023కు ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు.

One District One Product: ఏపీలో ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’లో చేనేత హవా

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్‌ టూరిజం హబ్‌గా భారతదేశం ఎదిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, చెన్నైలో మోడ్రన్‌ క్రూయిజ్‌ హబ్‌లు తీసుకువచ్చామన్నారు. ముంబైలో కూడా త్వరలో ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ హబ్‌ రాబోతోందని తెలిపారు. అలాగే రూ.655 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టు చేపట్టిన ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6, 7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.633 కోట్లతో పూర్తి చేసిన విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ రెండో విడత విస్తరణ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి పోర్టు ట్రస్ట్‌ చీఫ్‌ ఇంజనీరింగ్‌ విభాగం సలహాదారు వేణు ప్రసాద్, వీసీటీపీఎల్‌ ప్రతినిధి కెప్టెన్‌ జాలీ, జేఎం.బక్షి, బోత్రా తదితరులు పాల్గొన్నారు. 

Venkatagiri handlooms: వెంకటగిరి వస్త్రాలకు జాతీయ గుర్తింపు

Published date : 19 Oct 2023 08:54AM

Photo Stories