Skip to main content

Farooq Abdullah: ఎన్‌సీ చీఫ్‌గా మళ్లీ ఫరూక్‌

నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) అధ్యక్షుడిగా ఫరూక్‌ అబ్దుల్లా (85) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హజ్రత్‌బల్‌లోని నసీమ్‌బాగ్‌లో ఉన్న ఎన్‌సీ వ్యవస్థాపకుడు షేక్‌ మహ్మద్‌ అబ్దుల్లా సమాధి వద్ద ఆయన 117వ జయంతిని పురస్కరించుకుని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడిగా ఫరూక్‌ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవికి కేవలం ఒకే ఒక్క నామినేషన్‌ అందిందని ఎన్‌సీ ప్రధాన కార్యదర్శి అలీ మహ్మద్‌ సగర్‌ చెప్పారు. 2014లో కొడుకు ఒమర్‌ రాజీనామాతో ఫరూక్‌ పార్టీ పగ్గాలు స్వీకరించారు. 

World Boxing Championships: బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భార‌త్‌కు 11 పతకాలు

Published date : 06 Dec 2022 11:53AM

Photo Stories