Skip to main content

Ram Lalla Silver Coin: అయోధ్య రాముడి వెండి నాణెం విడుదల.. ధర ఎంతంటే..

అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యాక రామ్‌లల్లాను దర్శించుకునేందుకు వేలాదిగా భకులు తరలివస్తున్నారు.
Ram Lalla Silver Coin Launched Silver coin featuring Ayodhya Ram Temple design released by the government

వీరు ఇక్కడి వస్తువులను కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళుతున్నారు. అయోధ్యకు వచ్చి రామ్‌లల్లా దర్శనం చేసుకోలేని వారు ఆన్‌లైన్‌లో ప్రసాదాన్ని తెప్పించుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం 50 గ్రాముల అయోధ్య రామాలయ వెండి నాణేలను ప్రజలకు విక్రయించేందుకు విడుదల చేసింది. 

ఈ నాణెం ధర రూ.5,860. 50 గ్రాముల బరువున్న ఈ నాణెం 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ నాణెంలో ఒక వైపు రామ్ లల్లా విగ్రహం, మరొక వైపు రామాలయ దృశ్యం కనిపిస్తాయి. ఆలయంలోని రామ్‌లల్లా విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగి రాజ్ రూపొందించారు. దీనిని ఇంటిలోని పూజా మందిరంలో ఉంచవచ్చని, లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చని ట్రస్ట్‌ తెలిపింది. 

ప్రధాని మోదీ గత జనవరి 22న అయోధ్య  రామాలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.  ఈ కార్యకమం జరగుతుండగా  ఆర్మీ హెలికాప్టర్లు ఆలయంపై పూలవర్షం కురిపించాయి. ఆరోజు మొదలుకొని అయోధ్యలో సందడి కొనసాగుతోంది. 

Geographical Indication Tag: కటక్ సిల్వర్ ఫిలిగ్రీకి భౌగోళిక సూచిక గుర్తింపు

Published date : 15 Apr 2024 04:03PM

Photo Stories