Skip to main content

Lara Thermal Plant: లారా థర్మల్‌ ప్లాంట్‌ జాతికి అంకితం!

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మితమైన ఎన్‌టీపీసీకి చెందిన 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేయనున్నారు.
Narendra Modi  PM Modi to Dedicate NTPC Lara Power Plant to the Nation   Video Conference Inauguration

రెండవ దశలో మరో 1,600 మెగావాట్ల ప్లాంట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 
మొదటి దశ స్టేషన్‌ను దాదాపు రూ.15,800 కోట్లతో అభివృద్ధి చేయ‌గా, రెండో దశ ప్రాజెక్టుకు రూ.15,530 కోట్ల పెట్టుబడులు రానున్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్ట్ కోసం బొగ్గు ఎన్‌టీపీసీకి చెందిన తలైపల్లి బొగ్గు బ్లాక్ నుంచి మెర్రీ-గో-రౌండ్ (ఎంజీఆర్‌) వ్యవస్థ ద్వారా సరఫరా అవుతుందని, తద్వారా దేశంలో తక్కువ ధరలకే విద్యుత్ సరఫరా అవుతుంది. 

అలాగే ఛత్తీస్‌గఢ్‌లో రూ.600 కోట్ల విలువైన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఇసిఎల్) మూడు ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా మోదీ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తొలి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సహా ఐదు ఎయిమ్స్‌ను ప్రారంభించనున్నారు. వీటిలో మంగళగిరి (ఆంధ్రప్రదేశ్), భటిండా (పంజాబ్), రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), కళ్యాణి (పశ్చిమ బెంగాల్)లలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌లు ఉన్నాయి. 

IIITDM Kurnool: రూ.296.12 కోట్లతో ట్రిపుల్ ఐటీడీఎం క్యాంపస్‌ నిర్మాణం.. జాతికి అంకితం!!

Published date : 24 Feb 2024 01:36PM

Photo Stories