Skip to main content

Himachal: నేటితో ‘హిమాచల్‌ప్రదేశ్’కు 76 ఏళ్లు.. ఈ రాష్ట్ర మొద‌టి సీఎం ఎవ‌రంటే..?

హిమాచల్ ప్రదేశ్ ఈ రోజు 76వ ఏట అడుగుపెట్టింది.
Himachal turns 76 Years today  76th Himachal Pradesh State Foundation Anniversary   Cultural Diversity of Himachal Pradesh

ఈ రాష్ట్రం 1948 ఏప్రిల్ 15వ తేదీ ఆవిర్భవించింది. నేడు హిమాచల్ దినోత్సవాన్ని సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. అనేక మైలురాళ్లను దాటిన హిమాచల్ ప్రదేశ్ నేడు అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉంది. 

1948లో హిమాచల్ ప్రదేశ్‌లో అక్షరాస్యత రేటు ఏడు శాతంగా ఉంది. ఇది 76 సంవత్సరాల తర్వాత అంటే నేటికి 82.80 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. 1948లో వీటి సంఖ్య సున్నా. ఆరోగ్య రంగంలో కూడా రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. హిమాచల్‌లో ప్రస్తుతం ఒక ఎయిమ్స్‌, ఐదు వైద్య కళాశాలలు, ఐదు డెంటల్ కళాశాలలు, పలు నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి.

దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. 1948వ సంవత్సరంలో హిమాచల్ ప్రజల తలసరి ఆదాయం రూ.240 కాగా, ప్రస్తుతం రూ.2,35,199కి చేరుకుంది.

India First General Elections: ఎన్నికల ఆరంభం అదిరింది.. తొలి సాధారణ ఎన్నికల్లో ఎటు చూసినా సవాళ్లే!!

స్వాతంత్య్ర‌ సమరయోధుడు, సంఘ సంస్కర్త యశ్వంత్ సింగ్ పర్మార్ హిమాచల్ తొలి ముఖ్యమంత్రి. ఈయన 1952 నుంచి 1977 వరకు అధికారంలో ఉన్నారు. ఠాకూర్ రామ్ లాల్ 1977, 1980లలో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. శాంత కుమార్ 1977, 1990లో రెండుసార్లు అధికారంలో కొనసాగారు.
వీరభద్ర సింగ్ 1985, 1993, 2003, 2012,2017లో ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ 1998, 2007లో అధికారాన్ని చేపట్టారు. 2017లో జైరాం ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారు. సుఖ్విందర్ సింగ్ సుఖు 2023 నుండి అధికారంలో కొనసాగుతున్నారు.

Library Village: దేశంలో లైబ్రరీ విలేజ్‌ ఎక్కడుందో తెలుసా.. ఈ పేరెలా వచ్చిందంటే..!

Published date : 15 Apr 2024 03:06PM

Photo Stories