Skip to main content

Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. చెన్నైలో కూడా

దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ (బుధ‌వారం) మధ్యాహ్నం భూకంపం సంభవించింది.
earthquake in delhi

కొన్ని సెకంన్ల‌ పాటు భూ ప్రకంపనలు వ‌చ్చాయి. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ ప్ర‌కారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదయింది. నేపాల్‌లోని జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు ఒక్క‌సారిగా కదల‌డంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇల్లు, కార్యాలయాల్లోని ప్రజలు భయంతో కేకలు వేస్తూ బయటకి పరుగులు తీశారు. కాగా ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

చెన్నైలోనూ భూకంపం
త‌మిళ‌నాడు రాజ‌దాని చెన్నైలోనూ భూమి కంపించ‌డంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం బయటికి పరుగులు తీశారు. మౌంట్‌, వైట్ రోడ్ల‌లో భూమి కంపించింది. అండ‌ర్ గ్రౌండ్ మెట్రో ప‌నుల కార‌ణంగానే భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు చెప్ప‌డంతో, కాద‌ని మెట్రో నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (22-28 జనవరి 2023)
 

Published date : 22 Feb 2023 03:28PM

Photo Stories