Coastal US Cities: ముంపు అంచున అగ్రరాజ్యం.. 24 తీర నగరాలు మునిగిపోయే ప్రమాదం!!
Sakshi Education
అమెరికాలోని 32 తీర నగరాలకు ముంపు ముప్పు పెరిగిందని తాజా అధ్యయనం హెచ్చరించింది.
వాతావరణ మార్పుల కారణంగా సముద్రమట్టాలు పెరుగుతున్నాయి, ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులను అదుపులోకి తీసుకోకపోతే, అమెరికా తీరప్రాంతాలకు ముంపు ముప్పు పెరిగిపోతుంది.
ప్రధాన అంశాలు..
- అమెరికాలోని 24 నగరాల్లో సముద్రమట్టం ప్రతి సంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది.
- 12 నగరాల్లో అంతర్జాతీయ సముద్రమట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి.
- 50 మందిలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని అధ్యయనం హెచ్చరిస్తుంది.
- 2050 సంవత్సరంకల్లా అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది.
- లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుంది.
- అమెరికాలో 109 బిలియన్ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని అంచనా.
Indian Population Other Than India: విదేశాల్లో ‘మినీ ఇండియా’.. ఆ దేశాలు ఇవే!!
ముంపు అంచున ఉన్న నగరాలు ఇవే..
- బోస్టన్
- న్యూయార్క్ సిటీ
- జెర్సీ సిటీ
- అట్లాంటిక్ సిటీ
- వర్జీనియా బీచ్
- విల్మింగ్టన్
- మేర్టల్ బీచ్
- చార్లెస్టన్
- సవన్నా
- జాక్సన్‌విల్లే
- మయామీ
- నేపుల్స్
- మొబిల్
- బిలోక్సీ
- న్యూ ఓర్లీన్స్
- స్లైడెల్
- లేక్ చార్లెస్
- పోర్ట్ ఆర్ధర్
- టెక్సాస్ సిటీ
- గాల్వెస్టన్
- ఫ్రీపోర్ట్
- కార్పస్ క్రిస్టీ
- రిచ్‌మండ్
- ఓక్లాండ్
- శాన్ ప్రాన్సిస్కో
- సౌత్ శాన్ ప్రాన్సిస్కో
- ఫాస్టర్ సిటీ
- శాంటాక్రూజ్
- లాంగ్ బీచ్
- హటింగ్టన్ బీచ్
- న్యూపోర్ట్ బీచ్
- శాండియాగో
Glass Bridge: ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన.. ఎక్కడ ఉందంటే..
Published date : 08 Mar 2024 01:30PM