Skip to main content

ఒక్క క్లిక్‌తో రూ.1.67లక్షలు మాయం

కథలాపూర్‌(వేములవాడ): సోషల్‌ మీడియాలో గృహ రుణం మంజూరు కోసం వచ్చిన కొత్త యాప్‌ను క్లిక్‌ చేయగా.. ఓ వ్యక్తి రూ.1.67 లక్షలు మోసపోయి న సంఘటన పెగ్గెర్లలో జరిగింది.
Home Loan App Scam,Rs 1 lakhs 67 Thousand lost with one click,social media fraud ,Pegger Incident
ఒక్క క్లిక్‌తో రూ.1.67లక్షలు మాయం

 పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడి సెల్‌ఫోన్‌ సోషల్‌ మీడియాలో గృహ రుణం మంజూరుకు సంబంధించి ఓ యాప్‌ క్లిక్‌ చేయాలని సందేశం వచ్చింది. ఆ యువకుడు యాప్‌ను క్లిక్‌ చేశారు. మొదటగా రూ.1,250 చెల్లించాలని బ్యాంక్‌ ఖాతా నంబరు పంపించారు. ఆ యువకుడు రూ.1,250 చెల్లించారు. ఇలా రూ.1.67 లక్షలు చెల్లించాక రుణం మంజూరు కాలేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సెప్టెంబ‌ర్ 8న‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు.

చదవండి:

Cyber crime: సైబ‌ర్ నేర‌గాళ్ల చేతికి చిక్కిన ఐటీ ఉద్యోగి.. రూ.17 లక్షలు టోపీ

Fake Jobs: ఉద్యోగాల పేరిట సైబర్‌ మోసం

Published date : 09 Sep 2023 02:50PM

Photo Stories