Skip to main content

Mega Job Fair: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా

నిజామాబాద్‌ నాగారం: ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన కోసం జ‌నవ‌రి 5న నగరంలోని శివాజీనగర్‌లో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్‌ జ‌నవ‌రి 3న‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Private Sector Job Opportunities  Job Fair at District Employment Office   Job Fair Announcement  January 5 Job Fair Details

వరుణ్‌మోటార్స్‌లో ఎగ్జిక్యూటివ్‌, రిలేషన్‌ మేనేజర్‌, సర్వీస్‌ అడ్వయిజర్‌ తదితర పోస్టులకు డిగ్రీ, డిప్లొమా, బీటెక్‌ మెకానికల్‌ చదివిన వారు అర్హులన్నారు.

చదవండి: SAIL Recruitment 2024: సెయిల్ లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలన్నారు. జీతం రూ. 15వేల నుంచి రూ. 25వేలవరకు ఉంటుందని పేర్కొన్నారు. వయో పరిమితి 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 95817 68413, 99487 48428 నంబర్లను సంప్రదించాలన్నారు.

Published date : 05 Jan 2024 10:21AM

Photo Stories