Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
Sakshi Education
సింథియా: భారత ప్రభుత్వం స్థాపించిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైం అండ్ షిప్ బిల్డింగ్ (సెమ్స్) ఆధ్వర్యంలో సీడాప్, ఏపీఎస్‌ఎస్‌డీసీ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న 21 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ మేరకు బీఈ, బీటెక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు ప్రొడక్ట్ డిజైన్ ఇంజినీర్ – మెకానికల్ (30 సీట్లు) మోకాట్రానిక్స్ డిజైనర్ అండ్ సిస్టిమ్ ఇంటిగ్రేటేర్ ఇంజినీర్ కోర్సుల్లో 3 నుంచి 5 నెలలపాటు వసతి కల్పించి, ఉచిత శిక్షణ అందిస్తారు.
అనంతరం ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కమాండర్ గోపీ కృష్ణ శివ్వం డిసెంబర్ 6న ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు విశాఖపట్నం సింథియా జంక్షన్‌లో ఉన్న సెమ్స్ కేంద్రంలో, 9948183865, 8500687750, 0891– 2704010లో సంప్రదించి, డిసెంబర్ 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
Published date : 07 Dec 2023 03:23PM