Skip to main content

వైవీయూ డిగ్రీ పరీక్షలు తేదీలు ఇవే..

కడప ఎడ్యుకేషన్‌ : యోగివేమన విశ్వ విద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాల విద్యార్థులకు డిసెంబ‌ర్ 20వ తేదీ నుంచి 1, 3, 5 సెమిస్టర్‌ డిగ్రీ పరీక్షలు ప్రారంభమవుతాయని విశ్వ విద్యాలయం కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఆచార్య ఎన్‌. ఈశ్వరరెడ్డి వెల్లడించారు.
Yogivemana Vishwa Vidyalayam Affiliated Degree College students preparing for exams  YVU degree exams   Yogivemana Vishwa Vidyalayam Controller of Examination Acharya N. announcing exam dates

జిల్లాలోని 79 డిగ్రీ కళాశాలల్లో బిఏ, బీబీఏ, బీసీఏ, బీకాం, బీఎస్సీ, బీఒక్‌ కోర్సులు చదివే రెగ్యులర్‌, సప్లమెంటరీ కలిపి 35,562 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. వైవీయూ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌, కుల సచివులు ఆచార్య వైపీ వెంకటసుబ్బయ్య మార్గదర్శకంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

చదవండి: డీఎస్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి ఉత్తమ న్యాక్‌ అవార్డు

సెమిస్టర్ల వారీగా మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ విద్యార్థులు 7,313 మంది కాగా సప్లమెంటరీ 5324 మంది ఉన్నారన్నారు. మూడో సెమిస్టర్‌కు రెగ్యులర్‌ 5240 మంది, సప్లమెంటరీకి 6056 మంది ఉన్నారని తెలిపారు. ఐదో సెమిస్టర్‌కు రెగ్యులర్‌ 9103, సప్లిమెంటరీకి 2522 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. విశ్వ విద్యాలయం అబ్జర్వర్లును ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని వివరించారు.

sakshi education whatsapp channel image link

Published date : 19 Dec 2023 03:23PM

Photo Stories