Santoshkumar Shastri: పిల్లలకు ఆచారాలు నేర్పించండి
నవంబర్ 5న హనుమకొండ ఏషియన్ మాల్ పక్కన సాయిబాబా దేవాలయం సమావేశ హాలులో శ్రీలలితా గాయత్రి బ్రాహ్మణ సేవా సహకార సంఘం అధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంతోశ్‌కుమార్, విశిష్ట అతిథిగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, సంఘం జిల్లా అధ్యక్షులు అయినవోలు వెంకట సత్యమోహన్, స్కాలర్‌షిప్ కమిటీ చైర్మన్ డాక్టర్ అయితరాజు వెంకటనరసింహరావు, ప్రధాన కార్యదర్శి లకినెపల్లి శ్యామ్‌సుందర్‌రావు, కోశాధికారి లకినెపల్లి వెంకటేశ్వర్‌రావు పాల్గొని 28 మంది పేద బ్రాహ్మణ విద్యార్థులకు సంఘం ఆధ్వర్యంలో 2.50 వేలు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఈసందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.
చదవండి: Jobs: అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం
కార్యక్రమంలో జీవీఎస్ శ్రీనివాసాచార్యులు, పాలకుర్తి మధుసూదన్‌రావు, విజయలక్ష్మి, దేవులపల్లి వాణి, ఈటూరి కొండల్‌రావు, నాగేశ్వరరావు, జయప్రసాద్‌శర్మ, త్రిగనరిలో బ్రాహ్మణకుటుంబాలు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి.