Skip to main content

B Lingeswara Reddy: విద్యాప్రమాణాలు లోపిస్తే కఠిన చర్యలు

వంగర: పాఠశాలల్లో విద్యార్థుల విద్యాప్రమాణాలు లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి అన్నారు.
Enforcement of educational standards in Wangara schools, Strict action if educational standards are lacking, B. Lingeswara Reddy discussing student standards in schools,

 పాఠ్యప్రణాళికను పక్కాగా అనుసరించాలన్నారు. వంగర కేజీబీవీని న‌వంబ‌ర్ 3న‌ తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యాప్రమాణాలు, విద్యార్థులకు వడ్డిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. కేజీబీవీలో తరగతిగదులు, సౌకర్యాలు, సమస్యలను ఎస్‌ఓను అడిగితెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరతను తక్షణమే పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల్లో కనీస విద్యాసామర్థ్యాలను తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ (ఎస్‌ఈఏఎస్‌)–2023 ప్రత్యేక పరీక్ష నిర్వహించిందన్నారు. అంతకు ముందు స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ బి.రోహిణి పనితీరు సక్రమంగా లేదని, విద్యార్థులకు అందిస్తున్న భోజనాల్లో నాణ్యత పాటించడం లేదని, కేజీబీవీకి వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ డీఈఓకు ఫిర్యాదు చేశారు.

చదవండి: Physical Education: ‘వ్యాయామ విద్య’కు పెద్దపీట

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విధులు నిర్వహణలో బాధ్యతలోపిస్తే సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని ఎస్‌ఓను హెచ్చరించారు. వారంరోజుల్లో రెండు రోజులు కేజీబీవీని సందర్శించాలని ఎంఈఓ వై.దుర్గారావును ఆదేశించారు. అనంతరం అరసాడలో నాడు–నేడు పనులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఏపీఓ వంగపండు గోపీచంద్‌, ఎస్‌ఓ బి.రోహిణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Published date : 04 Nov 2023 02:59PM

Photo Stories