Skip to main content

Scholarships: పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

కొరుక్కుపేట: శ్రీచెన్నపురి దేవాంగ సమాజం ఆధ్వర్యంలో సెప్టెంబ‌ర్ 17న‌ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు.
September17,Korukkupet,Scholarships for poor students, Srichennapuri Devanga Samaj Scholarship Distribution
ఉపకార వేతనాలు అందుకున్న విద్యార్థులతో నిర్వాహకులు

చైన్నె పాత చాకలిపేటలోని శ్రీరామలింగ చౌడేశ్వరిదేవి ప్రేయర్‌ హాలులో ఈ కార్యక్రమం జరిగింది. దేవాంగ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద డిగ్రీ, పీజీ, డిప్లొమా చదువుతున్న 67 మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు.

చదవండి: Means-cum-Merit Scholarship : స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

సంఘం అధ్యక్షుడు కొనంకి జనార్ధనం, జనరల్‌ సెక్రటరీ జి.రఘు, కరుణమూర్తి, పముజుల బ్రహ్మయ్య, డి.శరవణన్‌, బుద్ధి జయరామ్‌ చేతుల మీదుగా స్కాలర్‌షిప్‌లు అందజేశారు. అలాగే పది, ప్లస్‌ టూలో ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులకు పతకాలు, నగదు ప్రోత్సహకాలు అందించారు. అసోసియేషన్‌ నేతలు బి.ప్రతాప్‌, యారాశి యుగంధర్‌, తారా చంద్రన్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

చదవండి: Scholarship Fees: స్కాలర్‌షిప్ ప‌రీక్ష ఫీజుకు గ‌డువు

 

Published date : 19 Sep 2023 02:28PM

Photo Stories