Skip to main content

10th Class Pass: మావల్‌ ఎంపీ.. ఎస్‌ఎస్‌సీ పాస్‌

శ్రీరంగ్‌ బర్నే.. మహారాష్ట్రలోని మావల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఐదు సార్లు అవార్డు అందుకున్నారు.
Maval MP SSC pass  Best Parliamentarian Award Winner x5  EducationalQualification

ఈసారి తన ఎన్నికల అఫిడవిట్‌లో కొత్త అర్హతను సగర్వంగా ప్రకటించారు. అదేంటంటే.. తన విద్యార్హతలో ఎస్‌ఎస్‌సీ అని రాయడం.

1997లో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీరంగ్‌ స్థానిక సంస్థల్లో పనిచేసి.. 2014, 2019 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1980లో ఎస్‌ఎస్‌సీ ఫెయిలైన శ్రీరంగ్‌ చదువుకు దూరమయ్యారు.

చదవండి: Tenth Class Results: మార్కులు చూసి మూర్చబోయిన విద్యార్థి.. ఐసీయూలో చేరిక

ఆ తరువాత రాజకీయాల్లో ఎన్ని విజయాలు సాధించినా విద్యార్హత కాలమ్‌ ఖాళీగా వదిలేయడం అతడిని వెంటాడింది.

క్రియాశీల రాజకీయాల్లో తీరిక లేని పనులతో ఉన్న శ్రీరంగ్‌కు కోవిడ్‌ కాలంలోని వరుస లాక్‌డౌన్ల సమయం కలిసొచ్చింది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని 2022లో ఎస్‌ఎస్‌సీ పరీక్షకు హాజరయ్యారు.

60 ఏళ్ల శ్రీరంగ్‌ 58 ఏళ్ల వయసులో పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడు సగర్వంగా ‘ఎస్‌ఎస్‌సీ పాస్‌’ అని అఫిడవిట్‌లో పొందుపరిచారు.  

Published date : 25 Apr 2024 12:30PM

Photo Stories