Free Training: కంప్యూటర్ కోర్సుల్లో యువతకు ఉచిత శిక్షణ
Sakshi Education
పటమట(విజయవాడతూర్పు): రక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు సాఫ్ట్‌వేర్ రంగంలో డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రక్ష ఫౌండేషన్ చైర్‌పర్సన్, కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్ పర్సన్ పడమట స్నిగ్ధ, మానవ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగర సురేష్ కుమార్ తెలిపారు.
పటమట డొంకరోడ్డులోని సంస్థ కార్యాలయంలో నవంబర్ 22న నిర్వహించిన విలే కర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా స్నిగ్ధ మాట్లాడుతూ కృష్ణా–గుంటూరు జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు, గృహిణులు, యువతీ యువకులకు శాప్/ఎస్‌డి కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
చదవండి: Free Training: కేవీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో ఉచిత శిక్షణ
డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ప్రతి శని – ఆదివారం ఈ ఉచిత శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. కోర్సుకి సంబందించిన శిక్షణ తరగతులు, మెటీరియల్ పూర్తి ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 9985222857, 9848828222 నంబర్లో సంప్రదించాలన్నారు.
Published date : 23 Nov 2023 02:27PM
Tags
- Free training
- computer courses
- Raksha Foundation
- Unemployed Youth
- Software Sector
- Patamata
- VijayawadaEast
- RakshaFoundation
- FreeTraining
- UnemployedYouth
- KrishnaGunturDistrict
- SoftwareCourses
- chairperson
- DCMS
- PadamataSnigdha
- SoftwareCourses
- ManavSevaSanstha
- Sakshi Education Latest News
- skill developmant
- career growth