Skip to main content

Paramedical Courses: పారా మెడికల్‌ కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు

Extent of application deadline for paramedical courses

తిరుపతి తుడా: తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కళాశాలలో పారా మెడికల్‌ డిప్లొమా కోర్సుల దరఖాస్తు గడువు పొడిగించినట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వసుంధరా దేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 19వ తేదీ లోపు ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ఇంటర్మీడియట్‌ బైపీసీ, ఎంపీసీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిప్లొమా కోర్సులకు అర్హులన్నారు. ఎస్వీ మెడికల్‌ కళాశాలలో మొత్తం 76 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో డిప్లొమా ఇన్‌ అనస్థీషియా టెక్నాలజీ – 30, డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ –30, డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ –10, డిప్లొమా ఇన్‌ డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌ – 6 సీట్లు అందుబాటులో ఉంటాయని, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని విద్యార్థులు దరఖాస్తుకు అర్హులన్నారు. http://www.appmb.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులను డౌన్లోడ్‌ చేసుకుని పూరించిన ఆ దరఖాస్తును ఆగస్టు 19వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు 100 రూపాయలు చెల్లించి పారా మెడికల్‌ విభాగంలో నమోదు చేయించుకోవాలన్నారు. ఇతర వివరాలకు మొబైల్‌ నంబర్‌ 9440879943 ను సంప్రదించాలని ఆమె కోరారు.

Training of Lab Technician: ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ

Published date : 29 Jul 2023 03:32PM

Photo Stories