Skip to main content

ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు

2019, జూలై 11 నుంచి 2019, జూలై 30 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.
మొత్తం 14 రోజులపాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులనుప్రభుత్వం ఆమోదింపజేసింది.ఇందులో 4 సాధారణ పాలనకు సంబంధించినవి కాగా, మిగతా 15 ఇవీ..

1. శాశ్వత బీసీ కమిషన్
బిల్లు ఉద్దేశం
  • బీసీలను అన్ని రకాలుగా బలోపేతం చేయడం.
  • బీసీల సాధికారత కోసం నిరంతరం పని చేయడం.
  • కుల సర్టిఫికెట్ల సమస్యలు, గ్రూపుల్లో మార్పు, చేర్పులు.
  • సామాజిక, ఆర్థిక, విద్య, ఇతర స్థితిగతుల ద్వారా బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించడం.
ఉపయోగాలు
  • బీసీల్లో ఆత్మ విశ్వాసం మరింత పెరుగుతుంది.
  • బీసీలకు అన్ని రంగాల్లో అవసరమైన రక్షణ చర్యలను కల్పిస్తుంది.
  • ఎవరైనా తమను బీసీ జాబితాలో చేర్చాలని కోరితే అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సిఫారసు చేస్తుంది.
  • విద్యా సంస్థల అడ్మిషన్లలో, ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పాటించకపోవడం ఫిర్యాదులపై విచారణ.
  • బీసీల సామాజిక ఆర్థిక, విద్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వేలు, అధ్యయనం.
  • బీసీల అభ్యున్నతికి అవసరమైన సంక్షేమ, ఇతర విధానాల రూపకల్పన.
  • బీసీలపై వేధింపులు లేదా సామాజిక బహిష్కరణ లాంటి ఘటనలు చోటు చేసుకుంటే సమగ్ర దర్యాప్తు.
లబ్ధి: సుమారు 2,02,97, 974 మందికి మేలు

2. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు
బిల్లు ఉద్దేశం
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా బలోపేతం చేయడం.
  • ఈ వర్గాలకు ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్.
  • బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్
  • అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, బాడీస్, సొసైటీలు, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో పని చేసే కమిటీలన్నింటిలో ఈ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్
  • డెరైక్టర్లు, సభ్యులుగా నామినేట్ చేసే పదవులన్నింటికీ 50 శాతం రిజర్వేషన్ల వర్తింపు
ఉపయోగాలు
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సామాజికంగా బలోపేతం అవుతారు.
  • ఈ వర్గాల వారికి రాజకీయంగా గుర్తింపు వస్తుంది.
  • ఆయా వర్గాల వారి స్థితిగతుల్లో మార్పు వస్తుంది.
లబ్ధి: వేలాది మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం

3. నామినేటెడ్ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు
బిల్లు ఉద్దేశం
  • ప్రభుత్వ నామినేటెడ్ కాంట్రాక్టు, సర్వీసు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఆయా వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడం.
  • రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పించడం.
ఉపయోగాలు
  • ప్రభుత్వ ఆధ్వర్యంలో నామినేషన్‌పై జరిగే అన్ని సివిల్ పనుల కాంట్రాక్టులు, నామినేషన్‌పై జరిగే సర్వీసుల్లో 50 శాతం పనులు దక్కుతాయి.
  • నామినేటెడ్ వర్క్ కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టులు, అన్ని ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ల పనుల్లో బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఆర్థిక స్థితిగతుల్లో మార్పు వస్తుంది.
లబ్ధి: లక్షలాది మందికి ప్రయోజనం

4. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు
బిల్లు ఉద్దేశం
  • జనాభాలో సగం మంది మహిళలే ఉన్నప్పటికీ విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే సంస్థల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో సమాన అవకాశాలు వారికి దక్కేలా చూడటం.
ఉపయోగాలు
  • మహిళలకు సగం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం చేకూర్చడంలో భాగంగా నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు
  • ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు దక్కుతాయి.
  • అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, బాడీస్, బోర్డులు, సొసైటీలు,కమిటీల చైర్‌పర్సన్, ఇతర పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
  • కార్పొరేషన్లు, ఏజెన్సీలు, బాడీస్, బోర్డులు, సొసైటీలు, కమిటీల్లో డెరైక్టర్స్,
  • సభ్యుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
లబ్ధి: వేలాది మంది మహిళలకు రాజకీయ, సామాజిక గుర్తింపు

5. నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
బిల్లు ఉద్దేశం
  • ప్రభుత్వంలోని అన్ని రకాల నామినేటెడ్ కాంట్రాక్టు పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చూడటం.
ఉపయోగాలు
  • మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం వల్ల కుటుంబాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయి.
  • అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించినట్లు అవుతుంది.
  • ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్లు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ల నామినేషన్ పనులన్నింటిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
లబ్ధి: లక్షలాది మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన

6.ఆలయాలు, ట్రస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
బిల్లు ఉద్దేశం
  • ఆలయాలు, ట్రస్టుల్లో కూడా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయాలనే సంకల్పం
  • అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు అగ్ర ప్రాధాన్యం
ఉపయోగాలు
  • రాష్ట్రంలో అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో 50 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దక్కుతాయి.
  • ఈ పదవుల్లోనూ మహిళలకు 50 శాతం పదవులు లభిస్తాయి.
  • ఆలయాల ఆస్తుల పరిరక్షణ, ప్రతిష్టను కాపాడటానికి వీలుంటుంది.
లబ్ధి : 25,000 మందికి ప్రత్యక్షంగా సామాజిక గుర్తింపు

7. పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు
బిల్లు ఉద్దేశం
  • పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.
  • పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఫ్యాక్టరీలను నెలకొల్పడం ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం.
  • మరింత సులభతరంగా బిజినెస్ చేసుకోవడానికి వీలుగా సరళతరమైన విధానాల రూపకల్పనకు మార్గం.
  • విద్యుత్, గనులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పోర్టుల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పన.
  • పరిశ్రమలకు భూములిచ్చి జీవనోపాధి కోల్పోతున్న స్థానికులకు ఆ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు.
ఉపయోగాలు
  • ఏ పరిశ్రమ, ఫ్యాక్టరీ అయినా పీపీపీ విధానంలో, జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో స్థానికులకు 75 శాతం తక్కువ కాకుండా ఉద్యోగాలు కల్పించాలి.
  • అర్హత గల, తగిన స్థానిక అభ్యర్థులు లేకపోతే పరిశ్రమలు, ఫ్యాక్టరీలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వమే తగిన శిక్షణ ఇస్తుంది.
  • ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నాటి నుంచి ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, పీపీపీ విధానంలోని జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో మూడేళ్లలోగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి.
లబ్ధి: లక్షల మంది యువతకు ఉపాధి

8. ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల బిల్లు
బిల్లు ఉద్దేశం
  • ఇటు భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా, అటు కౌలు రైతులు పంటలు పండించుకునేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, బ్యాంకుల నుంచి రుణం పొందేలా చూడటం.
ఉపయోగాలు
  • రాష్ట్రంలోని సుమారు 16 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం కలుగుతుంది. సాగుదారు రైతు హక్కుల కార్డు జారీ అవుతుంది.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సాగు కోసం భూములిస్తే ఆ భూములిచ్చిన యజమానులకు, సాగుదారులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.12,500 పెట్టుబడి సాయం అందుతుంది.
  • భూ యజమాని హక్కులకు భంగం కలగకుండా పంట సాగుదారుల హక్కుల కార్డు ద్వారా వ్యవసాయ భూమి సాగుదారులు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి పంట రుణాలు పొందవచ్చు.
  • ప్రభుత్వం నుంచి పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు అన్ని ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కలుగుతుంది.
లబ్ధి: 65.06 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు ప్రయోజనం

9. మద్య నియంత్రణ చట్టానికి సవరణ
బిల్లు ఉద్దేశం
  • పేద కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న మద్యం మహమ్మారిని తరిమివేయాలన్న మహిళల కోరిక మేరకు రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధంలో భాగంగానే ఈ బిల్లు.
  • మద్యం షాపుల లెసైన్సులు, మద్యం నియంత్రణకు చర్యలు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ యాక్టు 1993కు సవరణ.
  • ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులు లెసైన్‌‌స షరతులను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్టు షాపులను మూయించడం.
ఉపయోగాలు
  • రాష్ట్రంలో అక్టోబర్ నాటికి ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చేయాలని ఎకై్సజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ.
  • నిర్ణీత వేళల్లో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టి.. క్రమంగా విక్రయాలు తగ్గిస్తూ వస్తుంది.
  • దశల వారీగా పేదలకు మద్యం దూరం కావడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. గొడవలు తగ్గుముఖం పడతాయి.
లబ్ధి: లక్షలాది మంది మహిళలకు పెద్ద ఊరట.. వెల కట్టలేని లబ్ధి

10. ముందస్తు న్యాయ పరిశీలన అనంతరమే టెండర్లు (ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల చట్టం-2019)
బిల్లు ఉద్దేశం
  • టెండర్ల విధానంలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సమూల ప్రక్షాళన చేస్తూ ముందస్తుగానే న్యాయపరమైన పరిశీలన.
  • ప్రభుత్వ వనరులను అనుకూలమైన విధంగా వినియోగించడంలో భాగంగా తిరిగి టెండర్ నిర్వహించడం (రివర్స్ టెండరింగ్).
  • పనిగట్టుకుని ఎవరికీ లబ్ధి చేకూర్చకుండా, అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించడం.
  • ప్రభుత్వంలోని వివిధ శాఖలు రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువగల పనులకు సంబంధించిన వివరాలను ముందుగా హైకోర్టు న్యాయమూర్తికి పంపి, ఆయన సూచనల మేరకు మార్పులు చేయాలి.
ఉపయోగం
  • ప్రతి ప్రాజెక్టులోనూ పారదర్శకత పెరుగుతుంది. తద్వారా అవినీతికి ఆస్కారం ఉండదు.
లబ్ధి: రూ. వేల కోట్ల ప్రజా ధనం ఆదా.. పాలనలో పారదర్శకత

11. లోకాయుక్త ఏర్పాటు
బిల్లు ఉద్దేశం
  • రాష్ట్ర విభజన అనంతరం గత ఐదేళ్ల పాటు లోకాయుక్తను ఏర్పాటు చేయకుండానే గత సీఎం చంద్రబాబు పాలన సాగించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అవినీతి రహిత పాలనే ధ్యేయంగా అవినీతి తిమింగలాల భరతం పట్టేందుకు ఈ బిల్లు తీసుకువచ్చారు.
ఉపయోగాలు
  • వివిధ శాఖల్లో, ఇతరత్రా అవినీతి వ్యవహారాలపై తనంతట తానే లోకాయుక్త విచారణ చేస్తుంది.
లబ్ధి: కాలయాపన లేకుండా అవినీతిపై సత్వర విచారణ

12. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు, పశు సంపద మార్కెట్ల సవరణ బిల్లు
బిల్లు ఉద్దేశం
  • రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లను పటిష్టం చేయడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడటం.
ఉపయోగాలు
  • మార్కెట్ కమిటీలకు గౌరవ చైర్మన్లుగా వ్యవహరించే ఎమ్మెల్యేలు స్థానికంగా ఏ పంటకు ఎంత ధర ఉండాలో ప్రభుత్వానికి సూచిస్తారు. తద్వారా ధరల ీస్థిరీకరణ నిధి నుంచి నిధులు విడుదలవుతాయి.
లబ్ధి: సుమారు 65.06 లక్షల మంది రైతులకు ప్రయోజనం

13. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్
బిల్లు ఉద్దేశం
: ప్రతి విద్యా సంస్థ (పాఠశాల స్థాయిలో) ప్రభుత్వ నిబంధనలను పాటించేలా చూడటం.
ఉపయోగాలు: ఫీజుల నియంత్రణతో పాటు ప్రమాణాలను మెరుగు పరుస్తుంది. జాతీయ విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలవుతుంది.
లబ్ధి: 70,41,568 మంది పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం

14. ఉన్నత విద్య కమిషన్
బిల్లు ఉద్దేశం:
ఉన్నత విద్యా (ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు, పయివేటు, డీమ్డ్ యూనివర్సిటీలు)సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధనకు చర్యలు చేపడుతుంది.
ఉపయోగం: అధిక ఫీజులకు కళ్లెం పడుతుంది.
లబ్ధి: 25,00,000 మంది విద్యార్థులకు ప్రయోజనం

15. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్
బిల్లు ఉద్దేశం:భూ వివాదాల పరిష్కారం
ఉపయోగం
  • భూ యజమానులకు శాశ్వత హక్కు.
  • భూములను ఎవరు కొన్నా, అమ్మినా వెంటనే రెవిన్యూ రికార్డుల్లో నమోదు.
  • అక్రమ లావాదేవీలకు చెక్.
లబ్ధి: 65.06 లక్షల మంది రైతులు, లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం
Published date : 15 Aug 2019 05:14PM

Photo Stories