Cyber crime: సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన ఐటీ ఉద్యోగి.. రూ.17 లక్షలు టోపీ
హోసూరు: యూటూబ్ వీడియోలను లైక్ చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చునని నమ్మించి ఐటి ఉద్యోగి వద్ద రూ. 17 లక్షలు కొట్టేశారు సైబర్ క్రిమినల్స్. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా బర్గూరుకు చెందిన త్యాగు (26) బెంగళూరులో ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ఇతని వాట్సాప్‌కు వచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ వీడియోలను చూస్తూ, లైక్ చేసి డబ్బు సంపాదించవచ్చని చెప్పారు. నిజమేనని నమ్మిన త్యాగు కొద్దికొద్దిగా నగదును డిపాజిట్ చేస్తూ కమీషన్ అందుకొంటూ వచ్చాడు. త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని మోసగాళ్లు ఒత్తిడి చేయడంతో త్యాగు రూ. 17 లక్షలను వారి ఖాతాల్లోకి జమ చేశాడు. ఆ తరువాత దుండగులు ఆన్‌లైన్ లింక్‌ను బంద్ చేయడంతో మోసపోయిన త్యాగు క్రిష్ణగిరి క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇవీ చదవండి: TS TET.. హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జియోగ్రఫీ టాపిక్ వారీగా ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్
ఇవీ చదవండి: 12 లక్షల ర్యాంక్.. అయినా ఎంబీబీఎస్ సీటు.. ఎలా అంటే .?