Bus Arrangements: ఇంటర్ పరీక్షలకు ఆర్టీసీ ఏర్పాట్లు..
అనకాపల్లి: పిసినికాడ గ్రామంలో గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు ప్రజా రవాణాశాఖ జిల్లా అధికారి కె.పద్మావతి పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి అనకాపల్లి వచ్చే సర్వీసుల్లో ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపారు. రోజువారీ సర్వీసులు యథావిధిగా నడుస్తాయన్నారు.
Medical Students Graduation Day: ఘనంగా వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం వేడుక
వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 250 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, జిల్లాలోని డిపోలతోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ బస్సులు సమకూర్చామన్నారు. ప్రత్యేక బస్సులను మాత్రమే బహిరంగ సభకు ఏర్పాటు చేశామని, రోజువారీ సర్వీసులకు ఆటంకం లేదన్నారు.
TSPSC: గ్రూప్–1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
నేటి పరీక్షకు ప్రత్యేక ఏర్పాట్లు
సీఎం సభ నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఐఈవో కె.సుజాత పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు.
Free Coaching for Group Exams: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో గ్రూప్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ
Tags
- bus arrangements
- transport facilities
- Intermediate Students
- AP Inter Exams
- students transport
- exams schedule
- transport officers
- AP government
- RTC bus
- ap bus arrangements for inter students
- Education News
- Sakshi Education News
- anakapalle news
- student transportation
- Inter Exams
- Department of Public Transport
- Student support
- SakshiEducationUpdates