Skip to main content

Intermediate Public Exams 2024 :ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపుకు ఇదే చివరి తేదీ!

ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపుకు ఇదే చివరి తేదీ!
Principals responsible for correcting student details in nominal rolls.   Important update  Intermediate Public Exams 2024 :ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపుకు ఇదే చివరి తేదీ!
Intermediate Public Exams 2024 :ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపుకు ఇదే చివరి తేదీ!

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్‌ఐఓ ఎ.శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం స్థానిక స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్‌ఐఓ కార్యాలయంలో ఇంటర్‌ పబ్లిక్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈసీ కమిటీని నియమించారు. కమిటీ కన్వీనర్‌గా ఆర్‌ఐఓ శ్రీనివాసులు, సభ్యులుగా వరప్రసాదరావు, దీన్‌దయాళ్‌, కొండయ్య నియమితులయ్యారు. వృత్తి విద్యా కోర్సులను ఆదినారాయణరావు పర్యవేక్షించనున్నారు.

Also Read : పరీక్షా సమయం!.. ఒత్తిడిని జయించే మార్గాలు ఇవే..!

ఈ సందర్భంగా ఆర్‌ఐఓ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల ఏర్పాటు, మౌలిక వసతుల పరిశీలన, నిర్వహణ, సిబ్బంది నియామకాల వంటి అంశాలను కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇంటర్‌ పరీక్ష ఫీజును ఈ నెల 29వ తేదీ లోపు చెల్లించాలన్నారు. విద్యార్థుల నామినల్‌ రోల్స్‌కు సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే 28వ తేదీ లోపు ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌ సరిచేసుకోవచ్చన్నారు.

Also Read : 1st Year Study Material

ప్రాక్టికల్స్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్థులను మభ్యపెట్టేలా కొన్ని కళాశాలల యాజమాన్యాలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. విద్యార్థులు ప్రాక్టికల్స్‌, పరీక్షలకు సిద్ధం కావాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

Published date : 29 Jan 2024 09:31AM

Photo Stories