Skip to main content

AP Inter Colleges Reopen: జూన్‌ 1న కళాశాలలు పునఃప్రారంభం.. వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు

Important Dates for Junior College Students in Nandyala Newtown   AP Inter Colleges Reopen  Intermediate Board Releases Academic Calendar for 2024 25

నంద్యాల(న్యూటౌన్‌): జూనియర్‌ కళాశాలలు జూన్‌ 1వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. అదే రోజు నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు సైతం మొదలుకానున్నాయి.

ఈ మేరకు తాజాగా ఇంటర్మీడియెట్‌ బోర్డు 2024–25 నూతన విద్యా సంవత్సరానికి గాను వార్షిక క్యాలెండర్‌ను, షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్‌ కళాశాలలు 222 రోజులు పనిచేయనున్నాయి.

2025 మార్చి 31 ఆఖరి పనిదినంగా, ఏప్రిల్‌ 1 నుంచి 2025 జూన్‌ ఒకటి వరకు వేసవి సెలవులను ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరంలో అక్టోబర్‌ ఆఖరివారంలో సాంస్కృతిక, నవంబర్‌ ఆఖరివారంలో స్పోర్ట్స్‌ వారోత్సవాలను నిర్వహించనున్నారు. 


 

Published date : 19 Apr 2024 05:16PM

Photo Stories