Skip to main content

Tenth Class Public Exams 2024: పదో తర గతి మూల్యాంకనం ప్రక్రి య ప్రారంభం ....సమర్థవంతంగా నిర్వహించాలి

పదో తర గతి మూల్యాంకనం ప్రక్రి య ప్రారంభం ....సమర్థవంతంగా నిర్వహించాలి
Tenth Generation Evaluation Process at Gnanapuram  Tenth Class Public Exams 2024    Education Department RJD B. Vijayabhaskar Inspecting Evaluation Center
Tenth Class Public Exams 2024: పదో తర గతి మూల్యాంకనం ప్రక్రి య ప్రారంభం ....సమర్థవంతంగా నిర్వహించాలి

విశాఖ : పదో తర గతి మూల్యాంకనం ప్రక్రి య సోమవారం జ్ఞానాపురంలోని జూబ్లీ హైస్కూల్లో ప్రారంభమైంది. సబ్జెక్టుల వారీగా జవాబు పత్రాల పంపిణీ, మూ ల్యాంకనం చేపట్టే క్రమంలో 96 గ్రూపులను ఏర్పాటు చేశారు. 601 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 99 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 199 మంది స్పెషల్‌ అసిస్టెంట్లు మూల్యాంకనం విధుల్లో పాల్గొన్నారు. అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌, చీఫ్‌ ఎగ్జామినర్లకు కేటాయించిన విభాగాల వారీగా జవాబు పత్రాలు అందజేశారు. తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. మూల్యాంకనం ప్రక్రియలో ఎలా వ్యవహరించాలనే దానిపై డీఈవో ఎల్‌.చంద్రకళ ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. జిల్లాకు సుమారుగా 1,76,924 పేపర్లు మూల్యాంకనం కోసం వచ్చాయన్నారు. నిబంధనల మేరకు రోజూ 40 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలన్నారు.

సమర్థవంతంగా నిర్వహించాలి :మూల్యాంకనం ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని విద్యా శాఖ ఆర్జేడీ బి.విజయభాస్కర్‌ సూచించారు. మూల్యాంకనం కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఎక్కడి తప్పిదాలకు ఆస్కారం లేకుండా విధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షల విభాగం జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎస్‌.మురళీమోహన్‌, ప్రభుత్వ డైట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ యు.మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ శ్రీనివాసరావు, డిప్యూటీ డీఈవో గౌరీ శంకర్‌ పాల్గొన్నారు.

Also Read :  ఏపీ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?

Published date : 02 Apr 2024 12:53PM

Photo Stories