SSC Exam: టెన్త్ క్లాస్‌లో.. శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి
పెదబయలు మండలంలో అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో పెదబయలులో ఫిబ్రవరి 15వ తేదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఈవో మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించాలని, ఫేషియల్ హాజరు తప్పనిసరి అని చెప్పారు. విద్యార్థుల హాజరు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని రకాల ఆన్‌లైన్ యాప్‌లపై ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండి, సకాలంలో అప్‌లోడ్ చేయాలన్నారు.
మధ్యాహ్న భోజన పథకం మెనూ ప్రకారం అందించాలని హెచ్‌ఎంలకు సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేసిన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్థానిక గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్టీ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులతో మాట్లాడి అవగాహన కల్పించారు. విద్యార్థులను ఎ,బి,సి,డి గ్రేడ్స్‌గా విభజించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.
చదవండి: AP 10th Class Study Material
ఆశ్రమ పాఠశాలల్లో..
ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అబ్సలోం ఆదేశించారు. ఆయన చింతూరు మండలం తులసిపాక, గూడూరు, బొడ్డుగూడెం, విద్యానగరం, ఏడుగురాళ్లపల్లి, ఎటపాక మండలం నల్లకుంట, కేఎన్‌పురం ఆశ్రమ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా మెనూ అమలు చేయాలని, వంటలు రుచికరంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన ఎటపాక మండలం కేఎన్‌పురం ఆశ్రమ పాఠశాలలో రాత్రి నిద్రచేశారు.