Skip to main content

Jobs Through CPET: యువ‌త‌కు సీపెట్ ద్వారా ఉద్యోగాలు

సీపెట్ లో పొందిన శిక్ష‌ణ ద్వారా ఉపాధి అవ‌కాశాన్ని అందుకున్నారు యువ‌తీయువ‌కులు. ఉద్యోగాన్ని సాధించిన యువ‌త‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీపెట్ జాయింట్ డైరెక్ట‌ర్ మాట్లాడారు..
Student receiving employment through CPET coaching
Student receiving employment through CPET coaching

సాక్షి ఎడ్యుకేష‌న్: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌) నైపుణ్యాభివృద్ధి సాధించిన యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించి, జీవితాలకు అండగా నిలుస్తోంది. సీపెట్‌ కోర్సు పూర్తి చేసుకున్న 30 మందికి సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ డాక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ హైదరాబాద్‌ జోనల్‌ చీఫ్‌ మేనేజర్‌ డి.నగేష్‌ మంగళవారం ఉద్యోగ నియామక పత్రాలను అందజేసి అభినందించారు.

ITI Counselling: ఐదో విడ‌త కౌన్సెలింగ్ కు ద‌ర‌ఖాస్తులు

ఈ సందర్భంగా సీపెట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ 30 మందికి గెయిల్‌ ఇండియా సౌజన్యంతో ప్లాస్టిక్స్‌ ప్రొడక్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆపరేటర్‌ కోర్సులో ఆరు నెలల శిక్షణ ఇచ్చామన్నారు. ఉద్యోగం పొందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన క్రాకటూరు లక్ష్మీపరమేశ్వరి మాట్లాడుతూ.. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్తను చూసి మార్చి 29వ తేదీన ఈ ట్రైనింగ్‌లో చేరి ఉద్యోగం సాధించానన్నారు. తండ్రి మరణించారని, తల్లి కూలి పనులు చేస్తూ తనను చదివించారని పేర్కొన్నారు. మెడికల్‌ షాపులో పని చేసే తాను సీపెట్‌లో శిక్షణ అనంతరం హైదరాబాద్‌ సెక్యూర్‌ ఇండస్ట్రీలో సైతం శిక్షణ పూర్తి చేసుకుని అదే కంపెనీలో ఉద్యోగం పొందానని వివరించారు.

Published date : 04 Oct 2023 04:49PM

Photo Stories