Skip to main content

Global Crisis: ఎందుకు ఇన్ని కొలువులు పోతున్నాయ్‌... తాజాగా మ‌రో 7 వేల‌మంది జౌట్‌.. ఎక్క‌డంటే

ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌... ఈ కంపెనీల స‌ర‌స‌న మ‌రో సంస్థ చేరుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు భారీ సంఖ్య‌లో కొలువులు తొల‌గించిన కంపెనీల జాబితాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలే అధికంగా ఉన్నాయి. అయితే ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు కూడా ఆ జాబితాలోకి ఎక్కుతున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీస్థాయిలో ఉద్యోగులు క‌లిగిఉన్న ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ల‌లో డిస్నీ ఒక‌టి. ఇప్పుడు ఆ సంస్థ కూడా వివిధ కార‌ణాలు చెప్పి భారీగా ఉద్యోగుల‌ను ఇంటికి సాగ‌నంపుతోంది. ఆ వివ‌రాలు ఇలా...
Disney
Disney

మ‌రో నాలుగు రోజుల్లో...
ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వాల్డ్ డిస్నీ 7వేల ఉద్యోగాలను తీసివేయనుంది. తాజా నిర్ణ‌యంతో డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్, పార్క్స్ విభాగాల ఉ‍ద్యోగులు ప్రభావితం కానున్నారు. రాబోయే నాలుగు రోజుల్లో ఉద్యోగులకు గుడ్‌బై చెప్పేందుకు సంస్థ సిద్ధ‌మైంది. అంటే ఏప్రిల్ మొద‌టి నుంచి వీరంతా మాజీ ఉద్యోగులుగా మార‌నున్నారు. ఈ మేరకు డిస్నీ సీఈవో బాబ్ ఇగర్ మార్చి 27న ఉద్యోగులకు మెయిల్స్ సెండ్ చేశారు.

చ‌ద‌వండి: సాఫ్ట్‌వేర్ జాబ్ దొర‌క‌డం ఇంత క‌ష్ట‌మా... 150 కంపెనీల‌కు అప్లై చేస్తే...!​​​​​​​
కొత్త నియామ‌కాలు ఇప్పుడే కాదు....

ప్ర‌స్తుతం అన్ని రంగాలవారీగా ఖ‌ర్చులు భారీగా పెరిగాయి. ఈ నేప‌థ్యంలో 5.5 బిలియన్ డాలర్ల మేర ఖర్చును త‌గ్గించుకోవ‌డంతో పాటు, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి 7 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు  బాబ్‌ ఇగర్ ప్రకటించారు. ఇటీవల‌ డిస్నీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోయింది. గత మూడు నెలల్లో డిస్నీ+ కు ఒక శాతం కస్టమర్లు క్షీణించారు. దీనికి తోడు సంస్థ నష్టాలు కూడా పెరిగిపోవడంతో కొత్త నియామకాలను ఆపివేయడంతోపాటు 3.6 శాతం ఉద్యోగాలపై వేటు వేసేందుకు నిర్ణయించింది.

చ‌ద‌వండి:​​​​​​​ ఏడ‌బ్ల్యూఎస్ చేసిన వారికి భారీగా దెబ్బ‌...  9 వేల మందికి ఊస్టింగ్‌

Published date : 28 Mar 2023 03:08PM

Photo Stories