Skip to main content

Technology: విద్యా‍ర్థులు టెక్నాలజీకి అనుగుణంగా ఉండాలి..!

టెక్నాలజీతోపాటు విద్యా‍ర్థులు కూడా అందుకు అనుగుణంగా తయారవ్వాలని వృత్యంతర శిక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డెప్యుటీ సీఎం తెలిపారు. విద్యార్థులను ప్రోత్సాహిస్తూ ఇలా మాట్లాడారు..
Deputy CM Anjad Basha speaking in the APPUSMA program    Students preparing for technology   Vocational training program chiefguest

సాక్షి ఎడ్యుకేషన్‌: నేటి పోటీ ప్రపంచంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్పుతూ ప్రపంచస్థాయి పోటీలను తట్టుకునేలా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పేర్కొన్నారు. ఆదివారం కడప జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఆపూస్మ) ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.

Intermediate Practical: ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు మొదలు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యావిధానంలో సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాలంటే ఎప్పటికప్పుడు నూతన జ్ఞానాన్ని పొందాల్సి ఉందన్నారు.

Published date : 12 Feb 2024 09:50AM

Photo Stories