PG Medical Counselling: పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో అక్రమాలు
ఎంజీఎం : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఇన్‌సర్వీస్ కోటా అభ్యర్థులు బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఎదుట వారు మాట్లాడుతూ నకిలీ సర్టిఫికెట్లతో ఇన్‌సర్వీస్ కోటాలో అడ్మిషన్ పొందిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో కాకుండా ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయాలని కోరారు. అక్రమాలు జరిగిన నేపథ్యంలో థర్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌ను వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడుతున్న వీసీని వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు. అనంతరం రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి జనార్దన్, ఉపేందర్, శశికాంత్, శ్రీనాథ్, వంశీ, అనూష, తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తి సుదర్శన్, గుగులోత్ వీరేందర్ పాల్గొన్నారు.
చదవండి: Ayurvedic Medical College: ఆయుర్వేద వైద్యకళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా అశోక్‌కుమార్