Skip to main content

First AI Employee Pragya Mishra: ప్రజ్ఞా మిశ్రా.. తొలి ఓపెన్‌ ఏఐ ఉద్యోగా ప్రత్యేక గుర్తింపు!

యూనివర్సిటీల్లో తన చదువును పూర్తి చేసుకున్న ప్రజ్ఞా మిశ్రా.. ప్రస్తుతం ఆమె ఓపెన్‌ ఏఐలో తొలి ఉద్యోగిగా ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది..
 Head of Government Relations at Open AI  Pragya Mishra.. First employee at Open Artificial Intelligence Research Organization

సాక్షి ఎడ్యుకేషన్‌: ఓపెన్‌ ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌–యూఎస్‌) తొలి ఉద్యోగిగా మన దేశంలో నియామకం అయిన ప్రజ్ఞామిశ్రా ప్రత్యేక గుర్తింపు సాధించింది..

ఓపెన్‌ ఏఐలో ‘గవర్నమెంట్‌ రిలేషన్స్‌’ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించనుంది 39 సంవత్సరాల ప్రజ్ఞా మిశ్రా. ఇంతకు ముందు ‘ట్రూ కాలర్‌’లో పబ్లిక్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహించింది. పబ్లిక్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌గా వివిధ శాఖల మంత్రులు, స్టేక్‌ హోల్డర్‌లు, ఇన్వెస్టర్‌లు, మీడియా పార్ట్‌నర్‌లతో కలిసి పనిచేసింది. దీనికి ముందు మెటా ప్లాట్‌ఫామ్‌ ‘ఇంక్‌’లో మూడు సంవత్సరాలు పని చేసింది. మిస్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ వ్యతిరేక క్యాంపెయిన్‌కు నాయకత్వం వహించింది.

AP EAPCET 2024 Exam Rescheduled: ఏపీ ఎంసెట్‌ పరీక్ష తేదీల్లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే

ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన ప్రజ్ఞ ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌లో ‘బార్గెయినింగ్‌ అండ్‌ నెగోషియేషన్స్‌’ సబ్జెక్ట్‌లో డిప్లమా చేసింది.

IT Layoffs: ఐటీ కంపెనీల్లో కోత‌లు.. టాప్‌ 3 కంపెనీల్లో 64 వేల మందికి లేఆఫ్స్‌..!

ప్రజ్ఞ ప్రతిభావంతురాలైన గోల్ఫర్‌. 1998 నుంచి 2007 వరకు ఎన్నో ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్స్‌లో ఆడింది. మెడిటేషన్‌ ట్రైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వ్యక్తిత్వ వికాస కోణంలో పాడ్‌కాస్ట్‌లో ప్రసంగాలు చేసింది. ఈ నెల ఆఖరులో ‘ఓపెన్‌ ఏఐ’తో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది ప్రజ్ఞామిశ్రా.

DEECET 2024: డైట్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Published date : 20 Apr 2024 03:53PM

Photo Stories