Skip to main content

DEO: విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి

Efforts to improve students abilities

ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఉపాధ్యాయులు విద్యాశాఖ మార్గదర్శకాలు పాటిస్తూ విద్యార్థుల సామర్థ్యాలు పెంపునకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని సూచించారు. మండల కేంద్రంలోని పాఠశాల, కాటాపూర్‌లోని జెడ్పీ పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థినులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. పాఠశాలల్లో అమలవుతున్న ఉన్నతి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అనుసరించి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలన్నారు. విద్యాశాఖ రూపొందించిన తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఉపాధ్యాయులందరూ డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థుల ప్రగతిని ప్రతినెలా అప్లోడ్‌ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. కాటాపూర్‌ హైస్కూల్లో వివిధ తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యాశాఖ సూచించిన మార్గదర్శకాలను అనుసరించి విద్యాభివృద్ధికి పాటుపడాలన్నారు. పదోవతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వందశాతం ఉత్తమ ఫలితాలు వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.
- డీఈఓ పాణిని

sakshi education whatsapp channel image link

Published date : 14 Dec 2023 03:10PM

Photo Stories