Prof T Ramesh: విద్యతోనే విజ్ఞానం, వికాసం
ఏప్రిల్ 14న కేయూలోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ బాల్యం నుంచే వివక్షతకు గురయ్యారన్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని విద్యద్వారానే ఉన్నత స్థితిలోకి వచ్చిన అంబేడ్కర్ సేవలను నేటి యువత గుర్తుంచుకోవాలన్నారు.
చదవండి: Free Coaching: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ
కేయూ దూరవిద్యాకేంద్రం మాజీ డైరెక్టర్ ఎం ఎర్రగట్టుస్వామి ‘అంబేడ్కర్ థీయరీ ప్రాక్టీసెస్’ అనే అంశంపై కీలకపోన్యాసం చేస్తూ సామాజిక రుగ్మతులు పాలద్రోలేందుకు అంబేడ్కర్ ఎంతో కృషి చేశారన్నారు. అనంతరం కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి, ఎస్సీ,ఎస్టీ సెల్ డైరెక్టర్ రాజమణి ,అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, ఆచార్యులు కృష్ణమాచార్య, సీహెచ్ సమ్మయ్య మాట్లాడారు. కాగా, కాకతీయ యూనివర్సిటీలో 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు డాక్టరేట్ పొందిన పరిశోధకులను అతిథులు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
చదవండి: Education: చదువుతోనే బడుగులకు గుర్తింపు: ఆర్.కృష్ణయ్య