Skip to main content

Admission in 5th Class: గురుకులం పిలుస్తోంది.. ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

elangana Social Welfare Gurukula Vidyalaya Institute Notification 2024-25  Government Gurukula Vidyalayas Admission Notice for 5th Class   Application for admission in 5th Class in Govt gurukul schools    TSWRE IS Notification for Financial Year 2024-25

బెల్లంపల్లి: ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశానికి (వీటీజీ సెట్‌ –24) రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈ ఐఎస్‌) కార్యదర్శి, చీఫ్‌ కన్వీనర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకుల పాఠశాలలను ఆయా సంక్షేమ శాఖల ద్వారా గురుకులాలను నిర్వహిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమం ద్వారా బోధన చేస్తూ విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సహజసిద్ధమైన నైపుణ్యాలను వెలికితీయడానికి గురుకుల విద్యాలయాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. దీంతో ఆయా గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి ఏటా విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటోంది. ప్రవేశపరీక్షలో మెరిట్‌ మార్కుల ప్రాతిపదికన ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి సీటు కేటాయిస్తారు. ప్రభుత్వ గురుకులాల్లో సీటు సాధించిన విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.

చ‌ద‌వండి: 10th Class Exams 2024: కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి

జనవరి 6 వరకు గడువు..
ఐదో తరగతిలో ప్రవేశం కోసం 2024 ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఎంపిక చేసిన కేంద్రాలలో ఉదయం 11గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 1గంటకు ముగుస్తుంది. ప్రవేశ పరీక్ష రాయడానికి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 18న ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 2024 జనవరి 6వ తేదీ వరకు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇందుకు రుసుము రూ.100 ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఫోన్‌ నెంబర్‌తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తు దారులకు సూచనలు :

  • 2023–24 విద్యాసంవత్సరంలో నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ప్రస్తుత విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్నట్లుగా సంబంఽధిత పాఠశాల నుంచి బోనఫైడ్‌ /స్టడీ సర్టిఫికేట్‌ను దరఖాస్తుతో పాటు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
  • ఓ అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి ఫొటో పెట్టి దరఖాస్తు చేయరాదు. ఆ తీరుగా వ్యవహరిస్తే క్రిమినల్‌ చర్యలకు బాధ్యులవుతారు.
  • విద్యార్థుల ఎంపికకకు ఉమ్మడి జిల్లా యూనిట్‌గా పరిగణిస్తారు.
  • ఇతర సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1800 42545678ను ఉదయం 10–30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించవచ్చు.


ఉమ్మడి జిల్లాలో ఉన్న గురుకులాల వివరాలు
జిల్లా గురుకుల సొసైటీ గురుకులాలు
మంచిర్యాల టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 09
మంచిర్యాల ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 08
మంచిర్యాల టీఆర్‌ఈఐఎస్‌ 01
కొమురంభీమ్‌ టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 10
కొమురంభీమ్‌ టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 05
కొమురంభీమ్‌ ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 05
ఆదిలాబాద్‌ టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 03
ఆదిలాబాద్‌ ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 06
ఆదిలాబాద్‌ టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 13
నిర్మల్‌ మొత్తం గురుకులాలు 19

 

sakshi education whatsapp channel image link

Published date : 19 Dec 2023 02:56PM

Photo Stories