భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు - కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు
1. భారత సమాఖ్య ఏ విధంగా ఏర్పడింది?
ఎ) కేంద్రం, రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా
బి) రాష్ట్రాలు కేంద్రంలో విలీనమవడం ద్వారా
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
2. కింది వాటిలో భారత సమాఖ్య విశిష్ట లక్షణం ఏది?
ఎ) ఏక కేంద్ర లక్షణాలు ఉన్న సమాఖ్య
బి) సమాఖ్య లక్షణాలు ఉన్న ఏక కేంద్రం
సి) బలమైన రాష్ట్రాలున్న సమాఖ్య
డి) అర్ధ సమాఖ్య
- View Answer
- సమాధానం: ఎ
3. మొదటిసారిగా భారతదేశంలో సమాఖ్య వ్యవస్థను ఎప్పుడు ప్రతిపాదించారు?
ఎ) 1950
బి) 1947
సి) 1935
డి) 1946
- View Answer
- సమాధానం: సి
4. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) కేంద్ర జాబితా - 97 అంశాలు
బి) రాష్ట్ర జాబితా - 66 అంశాలు
సి) ఉమ్మడి జాబితా - 46 అంశాలు
డి) అవశిష్ట జాబితా - 52 అంశాలు
- View Answer
- సమాధానం: డి
5. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఏ అంశాన్ని మున్సిపల్ సంబంధంగా పేర్కొంటారు?
ఎ) రాష్ట్ర శాసన సంబంధమైన విషయాల్లో కేంద్రం నియంత్రణ
బి) రాష్ట్ర ఆర్థిక విషయాల్లో కేంద్రం నియంత్రణ
సి) రాష్ట్ర పరిపాలనలో కేంద్ర నియంత్రణ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
6. కింది వాటిలో భారత రాజ్యాంగంలోని సమాఖ్య విరుద్ధ లక్షణం ఏది?
ఎ) అఖిల భారత సర్వీసులు
బి) ఏకీకృత న్యాయవ్యవస్థ
సి) అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. కింది వాటిలో ఉమ్మడి జాబితాలోని అంశం ఏది?
ఎ) క్రిమినల్ లా
బి) సాంఘిక భద్రత
సి) ఆర్థిక, సాంఘిక ప్రణాళికలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
8. సాధారణ పరిస్థితుల్లో పార్లమెంటు రాష్ట్ర జాబితాలో ఎప్పుడు చట్టాలు చేస్తుంది?
ఎ) రెండు రాష్ట్ర శాసనసభలు తీర్మానం ద్వారా కోరినప్పుడు
బి) రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా అవసరాన్ని గుర్తించినప్పుడు
సి) అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసే సందర్భంలో
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
9. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) అవశిష్ట అధికారాలు - ప్రకరణ 248
బి) అంతర్రాష్ట్ర నదీజలాల ట్రైబ్యునల్ - ప్రకరణ 262
సి) అంతర్రాష్ట్ర మండలి - ప్రకరణ 263
డి) ఆర్థిక సంఘం - ప్రకరణ 249
- View Answer
- సమాధానం: డి
10.సమాఖ్యకు ఎలాంటి రాజ్యాంగం ఉండాలి?
ఎ) లిఖిత
బి) అలిఖిత
సి) దృఢ
డి) ఏ తరహా రాజ్యాంగమైనా ఉండవచ్చు
- View Answer
- సమాధానం: సి
11. కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే ఎన్నో నిబంధన ప్రకారం రాష్ట్రాలపై చర్య తీసుకోవచ్చు?
ఎ) 257
బి) 356
సి) 365
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
12. ‘భారతదేశం సమాఖ్య లక్షణాలున్న ఏక కేంద్రం కానీ, ఏక కేంద్ర లక్షణాలున్న సమాఖ్య కాదు’ అని పేర్కొన్నది ఎవరు?
ఎ) ఐవర్ జెన్నింగ్స్
బి) బి.ఆర్.అంబేద్కర్
సి) కె.సి. వేర్
డి) ఎవరూకాదు
- View Answer
- సమాధానం: సి
13. జోనల్ కౌన్సిళ్ల (ప్రాంతీయ మండలాలు)ను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?
ఎ) జోనల్ కౌన్సిల్స్ చట్టం
బి) రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం
సి) స్టేట్ కౌన్సిల్ చట్టం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
14. జోనల్ కౌన్సిళ్లకు ఉమ్మడి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) ప్రధానమంత్రి
బి) రాష్ట్రపతి
సి) కేంద్ర హోం మంత్రి
డి) ఉప రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: సి
15. విద్యుచ్ఛక్తి ఏ జాబితాలో ఉంది?
ఎ) కేంద్ర జాబితా
బి) రాష్ట్ర జాబితా
సి) ఉమ్మడి జాబితా
డి) అవశిష్ట జాబితా
- View Answer
- సమాధానం: సి
16. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం 1969లో నియమించిన కమిటీ ఏది?
ఎ) సర్కారియా కమిటీ
బి) రాజమన్నార్ కమిటీ
సి) సంతానం కమిటీ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
17. ఆర్థిక సంఘానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు
బి) ఈ సంఘం దాని సిఫారసులను రాష్ట్రపతికి సమర్పిస్తుంది
సి) ఈ సంఘానికి సలహా విధులు మాత్రమే ఉంటాయి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
18. మొదటి ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎవరు?
ఎ) కె.సి. నియోగి
బి) కె. సంతానం
సి) కె. బ్రహ్మానందరెడ్డి
డి) ఎన్.కె.పి. సాల్వే
- View Answer
- సమాధానం: ఎ
19. కింది వాటిలో కేంద్రం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసి, రాష్ట్రాలే తీసుకునే పన్ను ఏది?
ఎ) స్టాంప్ డ్యూటీ
బి) ఎక్సైజ్ డ్యూటీ
సి) కార్పొరేషన్ డ్యూటీ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
20. కింది వాటిలో సమాఖ్య విరుద్ధమైన సంస్థ ఏది?
ఎ) ప్రణాళికా సంఘం
బి) జాతీయ అభివృద్ధి మండలి
సి) అంతర్రాష్ట్ర మండలి
డి) ప్రాంతీయ మండలాలు
- View Answer
- సమాధానం: ఎ
21. ఈశాన్య మండలాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1956
బి) 1971
సి) 1972
డి) 1975
- View Answer
- సమాధానం: బి
22. భారత సమాఖ్యను ‘సహకార సమాఖ్య’గా అభివర్ణించింది ఎవరు?
ఎ) గాడ్విన్ ఆస్టిన్
బి) పి.జి. నెహ్రూ
సి) కె.సి.వేర్
డి) డాక్టర్ రాజేంద్రప్రసాద్
- View Answer
- సమాధానం: ఎ
23. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చిన అంశం ఏది?
ఎ) విద్య
బి) అడవులు
సి) కుటుంబ నియంత్రణ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
24. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్.ఎస్.సర్కారియా కమిషన్ను ఎప్పుడు నియమించింది? అది నివేదికను ఎప్పుడు సమర్పించింది?
ఎ) 1983, 1988
బి) 1984, 1989
సి) 1983, 1986
డి) 1985, 1990
- View Answer
- సమాధానం: ఎ
25. కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభించే ప్రణాళికా సహాయం ఏ ఫార్ములా ఆధారంగా బదిలీ అవుతుంది?
ఎ) గాడ్గిల్ ఫార్ములా
బి) లక్డావాలా
సి) ఉన్నతన్
డి) సెతల్వాద్
- View Answer
- సమాధానం: ఎ
26. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా విధించే పన్ను ఏది?
ఎ) అమ్మకం పన్ను
బి) ఆదాయం పన్ను
సి) ఎక్సైజ్ డ్యూటీ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: డి
27. కేంద్రమే విధించి, కేంద్రమే వసూలు చేసి, ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పన్ను ఏది?
ఎ) ప్రకటనలపై పన్ను
బి) రైల్వే చార్జీలపై పన్ను
సి) అంతర్రాష్ట్ర రవాణాపై పన్ను
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
28. కింది వాటిలో కేంద్రం, రాష్ట్రాల మధ్య విభజితమయ్యే పన్ను ఏది?
ఎ) సెంట్రల్ ఎక్సైజ్
బి) ఆదాయం పన్ను
సి) కార్పొరేషన్ పన్ను
డి) ఎ, బి
- View Answer
- సమాధానం: డి
29. కింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది ఏది?
ఎ) ఆదాయం పన్ను
బి) కార్పొరేషన్ టాక్స్
సి) సంపద పన్ను
డి) సెంట్రల్ ఎక్సైజ్
- View Answer
- సమాధానం: డి
30.కేంద్ర ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1950
బి) 1952
సి) 1953
డి) 1954
- View Answer
- సమాధానం: ఎ
31. జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1952
బి) 1962
సి) 1972
డి) 1982
- View Answer
- సమాధానం: ఎ
32. కింది వాటిలో ప్రధానమంత్రి దేనికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు?
ఎ) నీతి ఆయోగ్
బి) జాతీయ సమగ్రతా మండలి
సి) జాతీయ రక్షణ మండలి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
33. దేశంలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి ఏది?
ఎ) పార్లమెంటు
బి) జాతీయ అభివృద్ధి మండలి
సి) ప్రణాళికా సంఘం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
34. కింది వాటిలో సమాఖ్య ముఖ్య లక్షణం ఏది?
ఎ) అధికార పృథక్కరణ
బి) అధికార విభజన
సి) అధికార బదలాయింపు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
35. కింది వాటిలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
ఎ) ఆర్.ఎస్. సర్కారియా
బి) రాజమన్నార్
సి) ఎం.ఎం. పూంచీ కమిషన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
36. కింది వాటిలో నీతి ఆయోగ్ విధి కానిది?
ఎ) పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం
బి) దేశంలో మానవ వనరులు, ఇతర వనరులను అంచనా వేయడం
సి) రాష్ట్ర ప్రణాళికలను ఆమోదించడం
డి) ప్రణాళికా అమలును సమీక్షించడం
- View Answer
- సమాధానం: డి
37. కేంద్ర, రాష్ట్రాల అధికార విభజనకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఉపయోగించే సూత్రాలను ఏమంటారు?
ఎ) డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్
బి) డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లైడ్ పవర్స్
సి) డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
38. ప్రభుత్వ విత్తంపై పార్లమెంటు నియంత్రణ చేసే పద్ధతి ఏది?
ఎ) బడ్జెట్
బి) అనుమతి ఉపక్రమణ బిల్లు
సి) ఆర్థిక బిల్లు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
39.కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకోవడానికి ఎవరు ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది?
ఎ) రాష్ట్రపతి
బి) పార్లమెంటు
సి) కేంద్ర ఆర్థిక మంత్రి
డి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
- View Answer
- సమాధానం: బి
40. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు కింది వాటిలో దేనిపై ఆధారపడతాయి?
1. రాజ్యాంగ ప్రకరణలు
2. సంప్రదాయాలు, వాడుకలు
3. న్యాయస్థానాల వ్యాఖ్యానాలు
4. సంప్రదింపులు, చర్చలు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 3, 4
డి) 1, 3, 4
- View Answer
- సమాధానం: ఎ
41. కింద పేర్కొన్న ఏ కమిషన్ కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను సమీక్షించలేదు?
ఎ) ఎం.ఎన్.పూంచీ
బి) రాజమన్నార్
సి) సర్కారియా
డి) దంత్వాలా
- View Answer
- సమాధానం: డి
42. కింది వాటిలో రాష్ట్ర జాబితాలోకి రాని అంశం ఏది?
ఎ) శాంతి భద్రతలు
బి) మైనింగ్
సి) జైళ్లు
డి) క్రిమినల్ ప్రొసీజర్స్
- View Answer
- సమాధానం: డి
43. కింది వాటిలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం కాని అంశం ఏది?
ఎ) గవర్నర్ల నియామకం
బి) రాష్ట్రపతి పాలన
సి) గ్రాంట్ల మంజూరు
డి) అఖిల భారత సర్వీసులు
- View Answer
- సమాధానం: డి
44. సహకార సమాఖ్య అంటే...?
ఎ) రాష్ట్రాల ప్రాధాన్యతలు గుర్తించడం
బి) కేంద్రంపై ఆధారపడటం
సి) రాష్ట్రాలు అడిగిన సహాయాన్ని కేంద్రం అందించడం
డి) పరస్పర ఆధార, ప్రాధాన్యాలు
- View Answer
- సమాధానం: డి
45. సహకార సమాఖ్యను పెంపొందించే రాజ్యాంగ ప్రకరణ ఏది?
ఎ) ప్రకరణ 252
బి) ప్రకరణ 258
సి) ప్రకరణ 258ఎ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
46. కేంద్ర బడ్జెట్ లోక్సభలో తిరస్కారం పొందితే..?
ఎ) బడ్జెట్ను మార్పు చేసి తిరిగి ప్రవేశపెడతారు
బి) కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తారు
సి) ప్రధాన మంత్రి, మంత్రిమండలి రాజీనామా చేయాలి
డి) రాష్ట్రపతి నిర్ణయం మేరకు పరిస్థితి ఉంటుంది
- View Answer
- సమాధానం:సి
47. రాజ్యాంగంలో ప్రస్తావించకుండా.. తర్వాతి కాలంలో అమల్లోకి వచ్చిన పన్ను ఏది?
ఎ) కార్పొరేట్ టాక్స్
బి) సర్వీస్ టాక్స్
సి) గిఫ్ట్ టాక్స్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
48. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) అడవులు - ఉమ్మడి జాబితా
బి) క్రీడలు - రాష్ట్ర జాబితా
సి) ప్రజారోగ్యం - రాష్ట్ర జాబితా
డి) లాటరీలు - ఉమ్మడి జాబితా
- View Answer
- సమాధానం: డి
49.భారత సమాఖ్య ఒక..?
ఎ) అర్ధ సమాఖ్య
బి) విశిష్ట సమాఖ్య
సి) కేంద్రీకృత సమాఖ్య
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
50. కింది వాటిలో భారత సమాఖ్యలోని ఏక కేంద్ర లక్షణం ఏది?
ఎ) అఖిల భారత సర్వీసులు
బి) గవర్నర్ల నియామకం
సి) అత్యవసర అధికారాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి