భారత రాజ్యాంగం - పీఠిక, విశిష్ట లక్షణాలు
1. భారత రాజ్యాంగాన్ని ప్రధానంగా ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు?
ఎ) ప్రజల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడానికి
బి) నేరస్థులను శిక్షించడానికి
సి) దేశాన్ని పరిపాలించడానికి
డి) విదేశాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెంపొందించడానికి
- View Answer
- సమాధానం: సి
2. భారతదేశ రాజ్యాంగ రచన చేసింది?
ఎ) రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు
బి) రాజ్యాంగ ముసాయిదా కమిటీ
సి) సలహా కమిటీ
డి) రాజ్యాంగ పరిషత్ సచివాలయం
- View Answer
- సమాధానం:బి
3. కింది వారిలో భారత రాజ్యాంగ పరిషత్‌లో సభ్యులు ఎవరు?
ఎ) బ్రిటిష్ పాలిత రాష్ట్రాల శాసనసభలతో ఎన్నికైనవారు, స్వదేశీ సంస్థానాల నుంచి నియమించినవారు
బి) రాజకీయ పార్టీలు నియమించినవారు
సి) ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్నవారు
డి) బ్రిటిష్ ప్రభుత్వం నియమించినవారు
- View Answer
- సమాధానం: ఎ
4. జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించిన రోజు?
ఎ) 1946 డిసెంబర్ 17
బి) 1946 డిసెంబర్ 11
సి) 1947 డిసెంబర్ 22
డి) 1947 జనవరి 22
- View Answer
- సమాధానం: డి
5. లౌకికవాదం అంటే..?
ఎ) తన మతాన్నే గౌరవించాలనుకోవడం
బి) అన్ని మతాలను గౌరవించడం
సి) ఇతర మతాలను వ్యతిరేకించడం
డి) రాజకీయాల్లో మత ప్రసక్తి
- View Answer
- సమాధానం: బి
6. భారత్ ‘గణతంత్ర రాజ్యం’గా ఏ తేదీన అవతరించింది?
ఎ) 1950 జనవరి 26
బి) 1949 నవంబర్ 26
సి) 1947 ఆగస్టు 15
డి) 1949 డిసెంబర్ 11
- View Answer
- సమాధానం: ఎ
7.సామ్యవాదం అంటే ఏమిటి?
ఎ) సంపదను సమానంగా పంపిణీ చేయడం
బి) ఆర్థిక వ్యవహారాల్లో రాజ్యం ప్రధానపాత్ర పోషించడం
సి) పరిశ్రమలన్నింటినీ రాజ్యం ఆధ్వర్యంలో నిర్వహించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
8. భారతదేశ రాజ్యాంగంలో ‘సామ్యవాదం’ అనే పదాన్ని ఏ సవరణ ద్వారా చేర్చారు?
ఎ) 42వ రాజ్యాంగ సవరణ-1976
బి) 44వ రాజ్యాంగ సవరణ-1976
సి) 45వ రాజ్యాంగ సవరణ-1976
డి) 48వ రాజ్యాంగ సవరణ-1976
- View Answer
- సమాధానం: ఎ
9. భారత రాజ్యాంగ చట్టంలో ప్రారంభంలో (ఒరిజినల్) ఎన్ని అధికరణలున్నాయి?
ఎ) 495
బి) 395
సి) 295
డి) 396
- View Answer
- సమాధానం: బి
10. భారతదేశం ఏ రాజ్య వ్యవస్థను అనుసరిస్తోంది?
ఎ) ఏకకేంద్ర రాజ్య వ్యవస్థ
బి) సమాఖ్య రాజ్య వ్యవస్థ
సి) పాక్షిక సమాఖ్య రాజ్య వ్యవస్థ
డి) బహుళ రాజ్య వ్యవస్థ
- View Answer
- సమాధానం: బి
1. ప్రజలు
2. రాష్ట్రపతి
3. కేబినెట్
4. ప్రధానమంత్రి
ఎ) 1, 2
బి) 2, 3
సి) 1, 4
డి) 3, 4
- View Answer
- సమాధానం: డి
12. ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరిచారు?
ఎ) 46వ రాజ్యాంగ సవరణ చట్టం
బి) 45వ రాజ్యాంగ సవరణ చట్టం
సి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం
డి) 42వ రాజ్యాంగ సవరణ చట్టం
- View Answer
- సమాధానం: డి
13.భారతదేశ ప్రజాస్వామ్యం ఏ ప్రాథమిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
ఎ) ఒక పౌరుడికి ఒక ఓటు
బి) ఒక పౌరుడికి రెండు ఓట్లు
సి) ఒక పౌరుడికి మూడు ఓట్లు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
14. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అత్యవసర అధికారాలను రాష్ట్రపతి ఎప్పుడు ఉపయోగిస్తారు?
ఎ) సాధారణ పరిస్థితుల్లో
బి) అసాధారణ పరిస్థితుల్లో
సి) ఎప్పుడైనా
డి) భవిష్యత్‌లో
- View Answer
- సమాధానం: బి
15. ఏక పౌరసత్వం అంటే..?
ఎ) ఒక వ్యక్తి దేశంలో ఎక్కడైనా పౌరుడిగా జీవించడం
బి) ఒక వ్యక్తి తన నివాస ప్రాంతంలో పౌరుడిగా జీవించడం
సి) ఒక వ్యక్తి తన సొంత రాష్ట్రంలోనే పౌరుడిగా జీవించడం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం:ఎ
16. భారత రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
ఎ) బి. నర్సింగరావు
బి) బి. రాజేంద్రప్రసాద్
సి) సచ్చిదానంద సిన్హా
డి) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
- View Answer
- సమాధానం: సి
17. ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్తు ఏది?
ఎ) వైమార్ రిపబ్లిక్
బి) ఫిలడెల్ఫియా కన్వెన్షన్
సి) నేషనల్ అసెంబ్లీ
డి) భారత రాజ్యాంగ పరిషత్తు
- View Answer
- సమాధానం: బి
18. రాజ్యాంగ పీఠికకు ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరణ చేశారు?
ఎ) 1
బి) 3
సి) 2
డి) 4
- View Answer
- సమాధానం: ఎ
19. ‘కేబినెట్ మిషన్ ప్లాన్’ను ఎప్పుడు ప్రకటించారు?
ఎ) 1948 జూన్ 16
బి) 1946 జూలై 17
సి) 1946 మే 16
డి) 1946 ఏప్రిల్ 16
- View Answer
- సమాధానం: సి
20. భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీలోని సభ్యుల సంఖ్య?
ఎ) 5
బి) 6
సి) 7
డి) 8
- View Answer
- సమాధానం: సి
21.ప్రవేశికలో భారతదేశం గురించి ఏ విధంగా పేర్కొన్నారు?
ఎ) సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
బి) సర్వసత్తాక, సామ్యవాద, గణతంత్ర రాజ్యం
సి) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
డి) ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
- View Answer
- సమాధానం: సి
22. భారత రాజ్యాంగం అత్యున్నత సార్వభౌమ అధికారాన్ని ఎవరికి కల్పించింది?
ఎ) సుప్రీంకోర్టు
బి) రాష్ట్రపతి
సి) భారత ప్రజలు
డి) ప్రధానమంత్రి
- View Answer
- సమాధానం: సి
23. భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ సమాఖ్య వ్యవస్థకు దగ్గరగా ఉంటుంది?
ఎ) ఆస్ట్రేలియా
బి) కెనడా
సి) అమెరికా
డి) నైజీరియా
- View Answer
- సమాధానం: బి
24.ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా అభివర్ణించినవారెవరు?
ఎ) వల్లభాయ్ పటేల్
బి) కృష్ణస్వామి
సి) మహాత్మా గాంధీ
డి) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
- View Answer
- సమాధానం: డి
25. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షుడిగా ఎప్పుడు ఎన్నికయ్యారు?
ఎ) 1945 డిసెంబర్ 11
బి) 1946 డిసెంబర్ 11
సి) 1946 డిసెంబర్ 13
డి) 1946 డిసెంబర్ 14
- View Answer
- సమాధానం: బి
26. భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా దేన్ని పేర్కొంటారు?
ఎ) హంస
బి) నెమలి
సి) ఐరావతం
డి) పావురం
- View Answer
- సమాధానం: సి
27. భారత రాజ్యాంగ పరిషత్‌కు ఏ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించారు?
ఎ) 1946
బి) 1948
సి) 1947
డి) 1949
- View Answer
- సమాధానం: ఎ
28. భారత రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు నిర్వహించినప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 189
బి) 389
సి) 489
డి) 289
- View Answer
- సమాధానం: బి
29. ముసాయిదా కమిటీ సమర్పించిన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది?
ఎ) 1949 జనవరి 26
బి) 1949 నవంబర్ 26
సి) 1950 జనవరి 26
డి) 1950 నవంబర్ 26
- View Answer
- సమాధానం: బి
30. భారత రాజ్యాంగంలోని మొదటి అధికరణం మనదేశాన్ని ఏ విధంగా వర్ణిస్తుంది?
ఎ) యూనియన్ ఆఫ్ స్టేట్స్
బి) యూనిటరీ
సి) ఫెడరేషన్
డి) కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్
- View Answer
- సమాధానం: ఎ
31. భారత రాజ్యాంగ నిర్మాణ సభ ‘ముసాయిదా కమిటీ’కి చైర్మన్‌గా ఎవరిని నియమించింది?
ఎ) పట్టాభి సీతారామయ్య
బి) బాబూ రాజేంద్రప్రసాద్
సి) రాజగోపాలాచారి
డి) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
- View Answer
- సమాధానం: డి
32. ‘భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం’ అని పేర్కొన్నవారు?
ఎ) ఐవర్జెన్నింగ్
బి) కె.సి. వేర్
సి) ఎ. కృష్ణస్వామి
డి) ఎర్నెస్ట్ బార్కర్
- View Answer
- సమాధానం: ఎ
33. లార్డ్ అట్లీ భారతీయులకు ఎప్పటిలోగా అధికారాలను బదిలీ చేస్తామని ప్రకటన చేశాడు?
ఎ) 1947 ఆగస్టు 15
బి) 1948 జూన్ 15
సి) 1947 ఫిబ్రవరి 20
డి) 1949 జూన్ 20
- View Answer
- సమాధానం:బి
34. ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) చైనా
బి) రష్యా
సి) ఫ్రాన్స్
డి) అమెరికా
- View Answer
- సమాధానం: బి
35. ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య ఎంత?
ఎ) 11
బి) 9
సి) 10
డి) 15
- View Answer
- సమాధానం: ఎ
36. భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం?
ఎ) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
బి) 2 సంవత్సరాల 8 నెలల 18 రోజులు
సి) 2 సంవత్సరాల 9 నెలల 18 రోజులు
డి) 2 సంవత్సరాల 7 నెలల 18 రోజులు
- View Answer
- సమాధానం: ఎ
37. సమానత్వ హక్కు ప్రధాన ఆశయం ఏ సమానత్వాన్ని స్థాపించడం?
ఎ) సాంఘిక సమానత్వం
బి) రాజకీయ సమానత్వం
సి) నైతిక సమానత్వం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
38. వ్యక్తి స్వాతంత్య్ర హక్కులో ఎన్ని రకాల స్వాతంత్య్రాలకు రక్షణ కల్పించారు?
ఎ) 5
బి) 6
సి) 8
డి) 7
- View Answer
- సమాధానం: బి
39. ఒక వ్యక్తిని పి.డి.చట్టం (ప్రివెంటివ్ డిటెన్షన్) కింద అరెస్ట్ చేసినప్పుడు అతడిని ఎంతకాలం పాటు జైలులో నిర్బంధించవచ్చు?
ఎ) 3 నెలలు
బి) 12 నెలలు
సి) 18 నెలలు
డి) 6 నెలలు
- View Answer
- సమాధానం: ఎ
40. అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు ఎన్ని గంటల్లోపు సమీప న్యాయమూర్తి ముందు హాజరు పరచాలి?
ఎ) 36
బి) 24
సి) 12
డి) 48
- View Answer
- సమాధానం: బి
41. ‘ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్’ అంటే అర్థం ఏమిటి?
ఎ) మనుషులను అక్రమంగా తరలించడం (సరకుల మాదిరిగా అమ్మడం, కొనడం)
బి) సరకులు అమ్మకం
సి) సరకులు కొనడం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
42. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరు పరచాలని తెలియజే సే రిట్ ఏది?
ఎ) హెబియస్ కార్పస్
బి) మాండమస్
సి) ప్రొహిబిషన్
డి) కోవారెంటో
- View Answer
- సమాధానం: ఎ
43. భారతదేశంలో రిట్లను జారీ చేసే న్యాయస్థానాలు ఏవి?
ఎ) దిగువ కోర్టులు
బి) సబార్డినేట్ కోర్టులు
సి) జిల్లా కోర్టులు
డి) ఉన్నత న్యాయస్థానాలు
- View Answer
- సమాధానం: డి
44. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలో అక్షరాస్యత శాతం ఎంత?
ఎ) 12
బి) 16
సి) 14
డి) 18
- View Answer
- సమాధానం: సి
45. జాతీయ విద్యా విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ) 1984
బి) 1988
సి) 1989
డి) 1986
- View Answer
- సమాధానం: డి
46. సమాఖ్య వ్యవస్థలో ఏ రకమైన రాజ్యాంగం అమల్లో ఉంటుంది?
ఎ) లిఖిత రాజ్యాంగం
బి) పరిమాణాత్మక రాజ్యాంగం
సి) అలిఖిత రాజ్యాంగం
డి) దృఢ రాజ్యాంగం
- View Answer
- సమాధానం: ఎ
47. రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలను మొదటగా ఏ ప్రభుత్వం చేస్తుంది?
ఎ) కేంద్ర
బి) రాష్ట్ర
సి) కేంద్రపాలిత ప్రాంతాలు
డి) స్థానిక ప్రభుత్వాలు
- View Answer
- సమాధానం: ఎ
48. భారత రాజ్యాంగంలో ప్రభుత్వ అధికారాలను ఎన్ని జాబితాలుగా వర్గీకరించారు?
ఎ) 3
బి) 2
సి) 1
డి) 4
- View Answer
- సమాధానం: ఎ