మతోద్యమాలు
1. భారతదేశంలో నూతన మతోద్యమాల కాలం ఏది?
ఎ) క్రీ.పూ. ఆరో శతాబ్దం
బి) క్రీ.పూ. అయిదో శతాబ్దం
సి) క్రీ.పూ. నాలుగో శతాబ్దం
డి) క్రీ.పూ. రెండో శతాబ్దం
- View Answer
- సమాధానం: ఎ
2. అజీవక మత స్థాపకుడు ఎవరు?
ఎ) గోసాలపుత్త
బి) అలరకలామ
సి) ఉద్దక రామపుత్త
డి) పార్శ్వనాథ
- View Answer
- సమాధానం: ఎ
3. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జైనమతంలో మొత్తం తీర్థంకరుల సంఖ్య 24
బి) మొదటి తీర్థంకరుడు రుషభనాథుడు
సి) చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
4. చార్వాక మత స్థాపకుడు ఎవరు?
ఎ) అలరకలామ
బి) నేమినాథ
సి) అజితకేశకంబళిన్
డి) ఆదినాథ
- View Answer
- సమాధానం: సి
5. జతపరచండి.
ఎ) 1-i,2-ii, 3-iii, 4-iv, 5-v గ్రూప్-ఎ గ్రూప్-బి 1. సల్లేఖన i. జైనులు ఆచరించే వ్రతం 2. శాద్వాదం ii. జైనతత్వం 3. విద్యాదేవి iii. జైనులు ఆరాధించే స్త్రీ దేవత 4. అంగాలు iv. జైనుల పవిత్ర గ్రంథాలు 5. దిగంబర, శ్వేతాంబర v. జైనమత శాఖలు
బి) 1-iv, 2-v, 3-iii, 4-ii, 5-i
సి) 1-ii, 2-i, 3-v, 4-iii, 5-iv
డి) 1-v, 2-iv, 3-i, 4-iii, 5-ii
- View Answer
- సమాధానం: ఎ
6.బౌద్ధమతంలో తాంత్రిక శాఖ ఏది?
ఎ) హీనయానం
బి) వజ్రయానం
సి) మహాయానం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
7. బుద్ధుడి తొలి గురువు ఎవరు?
ఎ) అలరకలామ
బి) ఉద్దక రామపుత్త
సి) ఎ, బి
డి) ఎవరూకాదు
- View Answer
- సమాధానం: సి
8. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) బుద్ధుడు ప్రతిపాదించిన సిద్ధాంతం - ప్రతీత్య సముత్పాద
బి) బౌద్ధమతం ఆచరించేవారు - ఉపాసికులు, బిక్షువులు
సి) బౌద్ధమత ముఖ్య శాఖలు - హీనయానం, మహాయానం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
9. చారిత్రకంగా జైన మతాన్ని స్థాపించినవారు ఎవరు?
ఎ) పార్శ్వనాథ
బి) సంభవనాథ
సి) రుషభనాథ
డి) వర్ధమాన మహావీర
- View Answer
- సమాధానం: ఎ
10. ‘తీర్థంకరుడు’ అంటే అర్థం ఏమిటి?
ఎ) మోక్షం ప్రసాదించేవాడు
బి) సంసార నావ దాటించేవాడు
సి) మార్గం చూపేవాడు
డి) బి, సి
- View Answer
- సమాధానం: డి
11. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో నూతన మతాలు ఏర్పడటానికి కారణం?
ఎ) హిందూ మతం పవిత్రత కోల్పోవడం
బి) బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణి
సి) కర్మకాండలకు ప్రాముఖ్యం ఇవ్వడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
12. మొదటి తీర్థంకరుడైన రుషభనాథుడిని నారాయణుడి అవతారంగా పేర్కొన్న పురాణం ఏది?
ఎ) విష్ణు పురాణం
బి) భాగవత పురాణం
సి) బ్రహ్మవైవర్త పురాణం
డి) ఎ, బి
- View Answer
- సమాధానం: డి
13. జైనులను ప్రారంభంలో ‘నిగ్రంధులు’ అని పిలిచేవారు. నిగ్రంధులు అంటే అర్థం?
ఎ) మార్గం చూపేవారు
బి) మోక్షాన్ని ప్రసాదించేవారు
సి) బంధాల నుంచి బయటపడిన వారు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
14.తీర్థంకరులు, వారి చిహ్నాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-i, 2-ii, 3-iii, 4-iv, 5-v గ్రూప్-ఎ గ్రూప్-బి 1. రుషభనాథ i. సింహం 2. అజితనాథ ii. పాము 3. అరిష్టనేమి iii. శంఖం 4. పార్శ్వనాథ iv. ఏనుగు 5. వర్ధమాన మహావీర v. వృషభం
బి) 1-v, 2-iv, 3-iii, 4-ii, 5-i
సి) 1-iv, 2-v, 3-i, 4-iii, 5-ii
డి) 1-iii, 2-ii, 3-v, 4-i, 5-iv
- View Answer
- సమాధానం:బి
15.పార్శ్వనాథుడికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) కాశీ రాజ్యానికి చెందినవాడు
బి) వర్ధమానుడి కంటే 250 ఏళ్ల ముందు జీవించాడు
సి) పార్శ్వనాథుడి తల్లిదండ్రులు - అశ్వసేనుడు, వామలాదేవి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
16. జైనమత పంచ సూత్రాల్లో నాలిగింటిని పార్శ్వనాథుడు రూపొందించగా, వాటికి బ్రహ్మచర్య సూత్రాన్ని చేర్చింది ఎవరు?
ఎ) వర్ధమాన మహావీరుడు
బి) నేమినాథ
సి) సంభవనాథ
డి) అరిష్టనేమి
- View Answer
- సమాధానం: ఎ
17. మహావీరుడు ఎవరి అనుమతితో సన్యాసం స్వీకరించాడు?
ఎ) తల్లి - త్రిసల
బి) భార్య - యశోద
సి) అన్నయ్య - నందివర్ధన
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
18. వర్ధమానుడికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) బిరుదులు- జినుడు, మహావీర, కేవలి
బి) జ్ఞానోదయం పొందిన స్థలం- జృంభిక గ్రామం
సి) నిర్యాణం చెందిన ప్రాంతం- పావాపురి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
19.జైన పంచ సూత్రాలను సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-v, 2-iv, 3-iii, 4-ii, 5-i గ్రూప్ - ఎ గ్రూప్ - బి 1. అహింస i. హింసకు పాల్పడవద్దు 2. అసత్యం పలకరాదు ii. సత్యం పలకాలి 3. అనస్తేయ iii. దొంగతనం చేయకూడదు 4. అపరిగ్రహ iv. ఆస్తులు కలిగి ఉండకూడదు 5. బ్రహ్మచర్యం v. వివాహం చేసుకోవద్దు
బి) 1-i, 2-ii, 3-iii, 4-iv, 5-v
సి) 1-iv, 2-v, 3-ii, 4-iii, 5-i
డి) 1-v, 2-ii, 3-i, 4-iii, 5-iv
- View Answer
- సమాధానం: బి
20. గణాధారులు అంటే..?
ఎ) వర్ధమానుడి ప్రత్యక్ష శిష్యులు
బి) గౌతమ బుద్ధుడి శిష్యులు
సి) అజీవక మతాన్ని అవలంబించేవారు
డి) చార్వాక సిద్ధాంతాన్ని నమ్మినవారు
- View Answer
- సమాధానం: ఎ
21. జైన సంఘం మొదటి థేర (అధ్యక్షుడు) ఎవరు?
ఎ) భద్రబాహు
బి) స్థూల భద్ర
సి) ఆర్య సుదర్శన్
డి) జామాలి
- View Answer
- సమాధానం: సి
22. ఆరో థేర అయిన భద్రబాహు మగధలో క్షామం వల్ల దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లు తెలియజేస్తున్న గ్రంథం ఏది?
ఎ) గాథాకోశ
బి) పరిశిష్టపర్వన్
సి) యశఃస్థిలక
డి) వైరాగ్య తరంగం
- View Answer
- సమాధానం:బి
23. జైనుల ప్రార్థనా మందిరాలను ఏమంటారు?
ఎ) బసది
బి) విహారం
సి) చైత్యం
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: ఎ
24. కింది వాటిలో సరైంది ఏది?
ఎ)మొదటి జైన సంగీతి స్థూలభద్రుడి అధ్యక్షతన పాటలీపుత్రంలో జరిగింది
బి) మొదటి జైన సంగీతిలో మహావీరుడి బోధనలను 12 అంగాలుగా అర్ధమాగధి భాషలో రచించారు
సి) రెండో జైన సంగీతి వల్లభి (గుజరాత్)లో దేవర్షి క్షమశ్రమణుడి అధ్యక్షతన జరిగింది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
25. దక్షిణ భారతదేశానికి వచ్చి సల్లేఖన వ్రతం ఆచరించిన ప్రముఖ మగధ పాలకుడు?
ఎ) అశోకుడు
బి) చంద్రగుప్తమౌర్య
సి) ఉదయన
డి) బిందుసార
- View Answer
- సమాధానం: బి
26. జైన అశోకుడిగా పేరు పొందిన మౌర్య పాలకుడు ఎవరు?
ఎ) కునాల
బి) బృహధ్రద
సి) సంప్రతి
డి) తివర
- View Answer
- సమాధానం: సి
27. చాముండరాయ నిర్మించిన గోమఠేశ్వర/బాహుబలి విగ్రహం కర్ణాటకలోని ఏప్రాంతంలో ఉంది?
ఎ) ఐహోల్
బి) శ్రావణ బెళగొళ
సి) పట్టడకల్
డి) హంపి
- View Answer
- సమాధానం: బి
28. జైన మతాభిమాని అయిన ప్రముఖ కళింగ పాలకుడు ఎవరు?
ఎ) ఖారవేలుడు
బి) ప్రతాపరుద్రుడు
సి) నరసింహదేవ
డి) అనంతచోడగాంగ
- View Answer
- సమాధానం: ఎ
29. జైనమతాన్ని అవలంబించిన రాష్ట్రకూట రాజు?
ఎ) అమోఘవర్షుడు
బి) నాలుగో ఇంద్రుడు
సి) ఎ, బి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
30. జతపరచండి.
ఎ) 1-i,2-ii, 3-iii, 4-iv, 5-v గ్రూప్-ఎ గ్రూప్-బి 1. మాయావతి i.బుద్ధుడి తపస్సు సమయంలో అతడిని వృక్షదేవతగా ఆరాధించిన స్త్రీ 2. ప్రజాపతి గౌతమి ii. బుద్ధుడి ద్వారా జనన మరణాల జ్ఞానం పొందిన మహిళ 3. యశోధర iii. బుద్ధుడి భార్య 4. కిసగౌతమి iv. బుద్ధుడిని పెంచిన తల్లి 5. సుజాత v. బుద్ధుడికి జన్మనిచ్చిన తల్లి
బి) 1-v, 2-iv, 3-iii, 4-ii, 5-i
సి) 1-ii, 2-iii, 3-iv, 4-i, 5-v
డి) 1-iii, 2-v, 3-ii, 4-i, 5-iv
- View Answer
- సమాధానం: బి
31. బుద్ధుడికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జ్ఞానోదయం కలిగిన గ్రామం ఉరువేలా
బి) జ్ఞానోదయం పొందిన రోజు వైశాఖ శుద్ధ పూర్ణిమ
సి) మహాపరినిర్యాణం చెందిన ప్రాంతం కుశినగరం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
32. బుద్ధుడి కర్మకాండలను ఏ రాజ్యంలో నిర్వహించారు?
ఎ) వైశాలి
బి) మల్ల
సి) గాంధార
డి) విజ్జి
- View Answer
- సమాధానం: బి
33. బుద్ధుడి జీవితంలో 5 ప్రధాన ఘట్టాలను పంచకల్యాణాలు అంటారు. ఆ సంఘటన వాటికి సంబంధించిన చిహ్నాలను జతపరచండి.
ఎ) 1-i, 2-ii, 3-iii, 4-iv, 5-v గ్రూప్-ఎ గ్రూప్-బి 1. జననం i. తామర పువ్వు 2. మహాభినిష్ర్కమణం ii. గుర్రం 3. జ్ఞానోదయం iii. రావిచెట్టు 4. ధర్మచక్ర పరివర్తనం iv. చక్రం 5. మహాపరినిర్యాణం v. స్తూపం
బి) 1-v, 2-iv, 3-iii, 4-ii, 5-i
సి) 1-ii, 2-iv, 3-v, 4-i, 5-iii
డి) 1-iii, 2-i, 3-iv, 4-v, 5-ii
- View Answer
- సమాధానం: ఎ
34. ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలను బోధించింది ఎవరు?
ఎ) వర్ధమాన మహావీరుడు
బి) బుద్ధుడు
సి) పార్శ్వనాథుడు
డి) అజితనాథుడు
- View Answer
- సమాధానం: బి
35. సంస్కృతం స్వీకరించక పూర్వం బౌద్ధమతస్థులు ఉపయోగించిన భాష ఏది?
ఎ) ప్రాకృతం
బి) అర్ధమాగధి
సి) పాళీ
డి) దేశీ
- View Answer
- సమాధానం: సి
36. కింది వాటిలో సరైన జత?
ఎ) వినయ పీఠిక - ఉపాలి
బి) సుత్త పీఠిక - ఆనందుడు
సి) అభిదమ్మ పీఠిక- వసుబంధు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
37. బుద్ధుడి పూర్వ జన్మలు తెలియజేసే జాతక కథలు ఏ పీఠికలో ఉన్నాయి?
ఎ) సుత్త పీఠిక
బి) వినయ పీఠిక
సి) అభిదమ్మ పీఠిక
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
38. బౌద్ధమతాన్ని స్వీకరించిన మొదటి మహిళ?
ఎ) యశోధర
బి) కిసగౌతమి
సి) ప్రజాపతి గౌతమి
డి) సుజాత
- View Answer
- సమాధానం: సి
39. బౌద్ధమత ప్రార్థనా మందిరాలను ఏమంటారు?
ఎ) విహారం
బి) చైత్యం
సి) స్తూపం
డి) బసది
- View Answer
- సమాధానం: బి
40. బౌద్ధ సంగీతులు, అధ్యక్షులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-i, 2-ii, 3-iii, 4-iv గ్రూప్ - ఎ గ్రూప్ - బి 1. మొదటి బౌద్ధ సంగీతి i. మహాకశ్యప 2. రెండో బౌద్ధ సంగీతి ii. సభాకామి 3. మూడో బౌద్ధ సంగీతి iii. మొగలిపుత్త తిస్య 4. నాలుగో బౌద్ధ సంగీతి iv. వసుమిత్రుడు
బి) 1-iv, 2-iii, 3-ii, 4-i
సి) 1-ii, 2-i, 3-iv, 4-iii
డి) 1-iii, 2-iv, 3-i, 4-ii
- View Answer
- సమాధానం: ఎ
41. బౌద్ధ సంగీతులు జరిగిన ప్రదేశాలు, నిర్వహించిన రాజులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-iv,2-iii, 3-ii, 4-i గ్రూప్ - ఎ గ్రూప్ - బి 1. రాజగృహం i. అజాతశత్రువు 2. వైశాలి ii. కాలాశోకుడు 3. పాటలీపుత్రం iii. అశోకుడు 4. కుందలవనం iv. కనిష్కుడు
బి) 1-i, 2-ii, 3-iii, 4-iv
సి) 1-iii, 2-iv, 3-i, 4-ii
డి) 1-ii, 2-iii, 3-iv, 4-i
- View Answer
- సమాధానం: బి
42. ఎన్నో బౌద్ధ సంగీతిలో బౌద్ధమతం హీనయాన, మహాయాన శాఖలుగా చీలిపోయింది?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- సమాధానం: డి
43. అశోకుడు తన కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రను బౌద్ధమత వ్యాప్తి కోసం ఏ దేశం పంపించాడు?
ఎ) శ్రీలంక
బి) నేపాల్
సి) భూటాన్
డి) చైనా
- View Answer
- సమాధానం: ఎ
44.శ్రీలంకకు చెందిన ప్రముఖ బౌద్ధ గ్రంథం?
ఎ) దీపవంశ
బి) మహావంశ
సి) చుళువంశ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి