జాతీయోద్యమం
1. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశం సందర్భంగా ‘నేషనల్ కాన్ఫరెన్స్’ను జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు?
ఎ) కలకత్తా (1886)
బి) బొంబాయి (1885)
సి) మద్రాస్ (1887)
డి) అలహాబాద్ (1888)
- View Answer
- సమాధానం: ఎ
2. మితవాద నాయకులకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) సురేంద్రనాథ్ బెనర్జీ - ఇండియన్ డెమస్తనీస్
బి) డబ్ల్యు.సి. బెనర్జీ - విస్మృత దేశ భక్తుడు
సి) ఫిరోజ్ షా మెహతా - సిల్వర్‌టంగ్ ఒరేటర్
డి) గోపాలకృష్ణ గోఖలే - గాంధీజీ రాజకీయ గురువు
- View Answer
- సమాధానం: సి
3. జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన మితవాద నాయకుడు, మొదటి ముస్లిం ఎవరు?
ఎ) మౌలానా అబుల్ కలాం
బి) బద్రుద్దీన్ త్యాబ్జి
సి) మహమ్మద్ అలీ
డి) సలీం అలీ
- View Answer
- సమాధానం: బి
4. కిందివాటిలో సరైంది ఏది?
ఎ) హౌస్ ఆఫ్ కామన్స్ కు పోటీ చేసిన మొదటి భారతీయుడు డబ్ల్యు.సి. బెనర్జీ
బి) బ్రిటన్ పార్లమెంట్లో మొదటి భారతీయ సభ్యుడు దాదాభాయ్ నౌరోజి
సి) జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్
డి) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: డి
5. మితవాదుల పద్ధతులైన ప్రార్థన, విజ్ఞప్తి, నిరసనలను P3 విధానంగా అభివర్ణించిన నాయకుడు ఎవరు?
ఎ) లాలా లజపతిరాయ్
బి) అరబిందో ఘోష్
సి) బాలగంగాధర తిలక్
డి) బిపిన్ చంద్రపాల్
- View Answer
- సమాధానం: బి
6. జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు మూడు సార్లు అధ్యక్షత వహించిన నాయకుడు?
ఎ) దాదాభాయ్ నౌరోజి
బి) ఫిరోజ్ షా మెహతా
సి) రాస్ బిహారీ ఘోష్
డి) పి.ఆనందాచార్యులు
- View Answer
- సమాధానం: ఎ
7. జతపరచండి.
1. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఎ. గోపాలకృష్ణ గోఖలే
2. ఇండియన్ పాలిటిక్స్ బి. సురేంద్రనాథ్ బెనర్జీ
3. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ సి. డబ్ల్యు.సి. బెనర్జీ
4. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సర్వీస్ డి. దాదాభాయ్ నౌరోజి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
- View Answer
- సమాధానం:బి
8. ‘నేషనల్ కాన్ఫరెన్స్’ను స్థాపించింది ఎవరు?
ఎ) సురేంద్రనాథ్ బెనర్జీ
బి) ఆనందమోహన్ బోస్
సి) ఎ, బి
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
9. 19వ శతాబ్దం చివరి అర్ధ భాగంలో నేషనల్ పేపర్, నేషనల్ స్కూల్, నేషనల్ జిమ్నాసియం, నేషనల్ సొసైటీ మొదలైన వాటిని స్థాపించి ‘నేషనల్’ అనే పదానికి విస్తృత ప్రచారం కల్పించినవారెవరు?
ఎ) నాగగోపాల్ మిత్ర
బి) రాజనారాయణ బోస్
సి) సత్యేంద్రనాథ్ ఠాగూర్
డి) భూపేంద్ర నాథ్
- View Answer
- సమాధానం: ఎ
10. బ్రిటిషర్లు సంపదను తరలించిన విధానం గురించి తెలిపే ఆర్.సి. దత్ రాసిన గ్రంథం ఏది?
ఎ) ప్రాస్పరస్ బ్రిటిష్ ఇండియా
బి) ఎకనమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా
సి) ఇండియన్ ఇండస్ట్రీస్ టుడే అండ్ టుమారో
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
11. ‘బ్రిటిష్ పాలన భారతదేశంపై సాగుతున్న నిరంతర దండయాత్ర, అది దేశాన్ని నాశనం చేస్తుంది’ అని అభిప్రాయపడినవారెవరు?
ఎ) దాదాభాయ్ నౌరోజి
బి) ఆర్.సి.దత్
సి) డి.ఆర్. గాడ్గిల్
డి) విలియం డిగ్బి
- View Answer
- సమాధానం: ఎ
-
12. ‘చలో ఢిల్లీ’ నినాదం ఇచ్చిన నేత?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) మహాత్మా గాంధీ
సి) సుభాష్ చంద్రబోస్
డి) లాలాలజపతిరాయ్
- View Answer
- సమాధానం: సి
13. రైత్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
ఎ) డల్హౌసీ
బి) థామస్ మన్రో
సి) వెల్లస్లీ
డి) హేస్టింగ్స్
- View Answer
- సమాధానం: బి
14. భూదానోద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు?
ఎ) మహాత్మా గాంధీ
బి) జయప్రకాశ్ నారాయణ్
సి) వినోబా భావే
డి) ఆచార్య కృపలానీ
- View Answer
- సమాధానం: సి
15.భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఏ సమావేశంలో ఆమోదించింది?
ఎ) కలకత్తా
బి) కరాచీ
సి) లాహోర్
డి) అలహాబాద్
- View Answer
- సమాధానం: సి
16. 1853లో బ్రిటీషర్లు ఏ రంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టారు?
ఎ) జనపనార మిల్లులు
బి) బొగ్గు గనులు
సి) రైల్వేలు
డి) తేయాకు తోటలు
- View Answer
- సమాధానం: సి
17. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ప్రముఖ అధికారి?
ఎ) అరుణా అసఫ్ అలీ
బి) షాన్వాజ్ ఖాన్
సి) డాక్టర్ ఎం.ఎ.అన్సా
డి) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
- View Answer
- సమాధానం: బి
18. చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి చేసిన నాయకుడు?
ఎ) జతిన్‌దాస్
బి) చంద్రశేఖర్ ఆజాద్
సి) సి.ఆర్.దాస్
డి) సూర్యసేన్
- View Answer
- సమాధానం: డి
19. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధాని?
ఎ) మౌంట్ బాటన్
బి) విన్స్టన్ చర్చిల్
సి) రాయ్ సేమెక్ డొనాల్డ్
డి) క్లెమెంట్ అట్లీ
- View Answer
- సమాధానం: డి
20. 1935లో ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టంలో కీలకాంశం ఏది?
ఎ) కేంద్రంలో సమాఖ్య ప్రభుత్వం
బి) కేంద్రంలో ఏకీకృత ప్రభుత్వం
సి) కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
21. ఏ సంవత్సరంలో గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయ్గా మార్చారు?
ఎ) 1858
బి) 1885
సి) 1905
డి) 1917
- View Answer
- సమాధానం: ఎ
22.కింది వాటిలో జాతీయ రాజకీయ పార్టీ ఏది?
1. ముస్లింలీగ్
2. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
3. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ
4. టెనంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ
ఎ) 1 మాత్రమే
బి) 2, 4
సి) 1, 2, 3
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
23.క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో వాస్తవం ఏది?
ఎ) పూర్తిగా అహింసాయుతంగా జరిగిన ఉద్యమం
బి) పై స్థాయిలోని మధ్య తరగతి ప్రజలు ఉద్యమం పట్ల ఆసక్తి చూపలేదు
సి) మస్లింలు ఉద్యమంలో పాల్గొనలేదు
డి) ఉద్యమ స్వరూపాన్ని గమనించిన బ్రిటీషర్లు భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని నిర్ణయించారు
- View Answer
- సమాధానం: సి
24. దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన పత్రిక?
ఎ) ఇండియా గెజిట్
బి) నవజీవన్
సి) ఇండియన్ ఒపీనియన్
డి) ఆఫ్రెకనీర్
- View Answer
- సమాధానం: సి
25. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి కారకుడైన జనరల్ డయ్యర్‌ను హత్య చేసింది?
ఎ) సోహన్ సింగ్ భాగ్నా
బి) వీవీఎస్ అయ్యర్
సి) హస్రత మోహన్
డి) ఉద్ధం సింగ్
- View Answer
- సమాధానం: డి
26. తనపై బాంబు దాడి జరిగినప్పటికీ భారతీయుల పట్ల వైఖరిని మార్చుకోని వైస్రాయ్?
ఎ) లార్డ్ హార్డింగ్
బి) వారన్ హేస్టింగ్స్
సి) లార్డ్ కర్జన్
డి) లార్డ్ చేమ్స్‌ఫర్డ్
- View Answer
- సమాధానం: ఎ
27. కింది వాటిలో సరైన జత.
ఎ) ప్రార్థనా సమాజ్ - దయానంద సరస్వతి
బి) సత్యశోధక్ సమాజ్ - కేశవ చంద్రసేన్
సి) బ్రహ్మసమాజ్ - జ్యోతి బాపులే
డి) శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం- నారాయణ గురు
- View Answer
- సమాధానం: డి
28. మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం?
ఎ) ఇండియన్ కౌన్సిల్ చట్టం-1861
బి) భారత ప్రభుత్వ చట్టం-1919
సి) ఇండియన్ కౌన్సిల్ చట్టం-1919
డి) భారత స్వాతంత్య్ర చట్టం-1947
- View Answer
- సమాధానం: సి
29. 1930లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధీజీ ఎక్కడి నుంచి ప్రారంభించారు?
ఎ) వార్ధా
బి) సేవాగ్రామ్
సి) సబర్మతి
డి) దండి
- View Answer
- సమాధానం: డి
30.రాబర్ట్ క్లైవ్ ప్రారంభించిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్?
ఎ) లార్డ్ వెల్లస్లీ
బి) లార్డ్ కారన్ వాలీస్
సి) వారన్ హేస్టింగ్స్
డి) మెట్కాఫ్
- View Answer
- సమాధానం: సి
31. ఠాగూర్ రచించిన జనగణమన గీతాన్ని తొలిసారిగా 1912లో ఏ పత్రికలో ప్రచురించారు?
ఎ) రాష్ట్ర జాగృతి
బి) తత్వబోధిని
సి) భారత విధాత
డి) అమృత బజార్
- View Answer
- సమాధానం: బి
32. ముస్లింలకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
ఎ) 1945
బి) 1940
సి) 1930
డి) 1920
- View Answer
- సమాధానం: బి
33.సివిల్ సర్వీస్ వ్యవస్థను ప్రారంభించినది?
ఎ) వారన్ హేస్టింగ్స్
బి) కారన్ వాలిస్
సి) లార్డ్ హార్డింజ్
డి) విలియం బెంటింక్
- View Answer
- సమాధానం: బి
34. ఏ ఘటన సందర్భంగా జరిపిన లాఠీచార్జీలో లాలా లజపతిరాయ్ గాయపడ్డారు?
ఎ) ఉప్పు సత్యాగ్రహం
బి) శాసనోల్లంఘన
సి) సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాటం
డి) నీలిమందు పోరాటం
- View Answer
- సమాధానం: సి
35. దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది?
ఎ) లార్డ్ డల్హౌసీ
బి) లార్డ్ కర్జన్
సి) లార్డ్ మెకాలే
డి) లార్డ్ బెంటింక్
- View Answer
- సమాధానం: డి
36. మహాత్మా గాంధీ ప్రారంభించిన సంస్థ?
ఎ) పోయినెల్స్ ఆశ్రమం
బి) విశ్వభారతి
సి) సేవాగ్రామ్ ఆశ్రమం
డి) సబర్మతి ఆశ్రమం
- View Answer
- సమాధానం: డి
37. ఏ ఉద్యమం సందర్భంగా గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చారు?
ఎ) ఖిలాపత్ ఉద్యమం
బి) సహాయ నిరాకరణోద్యమం
సి) శాసనోల్లంఘనోద్యమం
డి) క్విట్ ఇండియా ఉద్యమం
- View Answer
- సమాధానం: డి
38. 1857 తిరుగుబాటు జరిగిన వెంటనే బెంగాల్లో ప్రారంభమైన ఉద్యమం?
ఎ) సన్యాసుల విప్లవం
బి) రబ్బరు పంట అల్లర్లు
సి) సంబాల్ విప్లవం
డి) నీలిమందు విప్లవం
- View Answer
- సమాధానం: డి
39. హింద్ స్వరాజ్ గ్రంథ రచయిత?
ఎ) వి.డి.సావర్కర్
బి) గాంధీజీ
సి) తిలక్
డి) స్వామి శ్రద్ధానంద
- View Answer
- సమాధానం: బి
40. జతపరచండి
ఎ) ఎ-4, బి-3, సి-1, డి-2 ఎ) 1858 చట్టం 1) మింటో మార్లే సంస్కరణలు బి) భారత ప్రభుత్వ చట్టం 1919 2) బ్రిటిష్ రాణి అధికార చట్టం సి) భారత ప్రభుత్వ చట్టం 1935 3) ప్రాంతీయ స్వయంప్రతిపత్తి డి) 1909 కౌన్సిల్ చట్టం 4) ద్వంద్వ ప్రభుత్వం
బి) ఎ-3, బి-2, సి-1, డి-4
సి) ఎ-2, బి-4, సి-3, డి-1
డి) ఎ-2, బి-1, సి-4, డి-3
- View Answer
- సమాధానం: సి
41. బ్రిటిష్ పాలనలో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైంది?
ఎ) ఆగస్టు 1945
బి) సెప్టెంబర్ 1945
సి) ఆగస్టు 1946
డి) సెప్టెంబర్ 1946
- View Answer
- సమాధానం: డి
42. 1907లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఏ విషయమై అతివాదులు,మితవాదుల మధ్య విభేదాలు తలెత్తాయి?
ఎ) విద్య
బి) బహిష్కరణ
సి) సత్యాగ్రహం
డి) స్వరాజ్
- View Answer
- సమాధానం: డి
43. 1853 చార్టర్ చట్టం పరిధిలోకి రాని అంశం?
ఎ) ఈ చట్టం ప్రకారం భారత్‌లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు
బి) లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించిన విధంగా గవర్నర్ జనరల్‌కు నిర్ణయాధికారం
సి) సివిల్ సర్వీసెస్‌లో ఎంపిక కోసం పరీక్షలు నిర్వహించడం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
44.1916లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో అతివాదులు, మితవాదుల మధ్య సఖ్యత కుదిరింది. ఈ సమావేశం ఎక్కడ జరిగింది?
ఎ) సూరత్
బి) లాహోర్
సి) లక్నో
డి) నాగ్‌పూర్
- View Answer
- సమాధానం: సి
45. అస్పృశ్యత నివారణ కోసం అఖిల భారత హరిజన సంఘం(హరిజన్ సేవక్ సంఘ్)ను మహాత్మా గాంధీ ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1928
బి) 1930
సి) 1931
డి) 1932
- View Answer
- సమాధానం: డి
46. ఆర్య సమాజ్ను స్థాపించిన సంవత్సరం?
ఎ) 1874
బి) 1875
సి) 1882
డి) 1893
- View Answer
- సమాధానం: బి
47. స్వరాజ్యమే భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యమని దాదాబాయ్ నౌరోజి కలకత్తా సదస్సులో ప్రకటించారు. ఈ సమావేశం జరిగిన సంవత్సరం?
ఎ) 1896
బి) 1901
సి) 1905
డి) 1906
- View Answer
- సమాధానం: డి
48. ఎక్కడ జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ఆమోదించారు?
ఎ) కాన్పూర్
బి) బొంబాయి
సి) నాగ్‌పూర్
డి) కలకత్తా
- View Answer
- సమాధానం: సి
49. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను లార్డ్ వెవెల్ ఎవరికి తెలిపారు?
ఎ) మహాత్మా గాంధీ
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) ఎం.ఎ.జిన్నా
డి) మౌలానా అబుల్ కలాం ఆజాద్
- View Answer
- సమాధానం: బి
50.బెంగాల్ తొలి గవర్నర్ జనరల్?
ఎ) లార్డ్ కారన్ వాలిస్
బి) లార్డ్ క్లైవ్
సి) లార్డ్ వెల్లస్లీ
డి) వారన్ హేస్టింగ్స్
- View Answer
- సమాధానం: డి
51. ఎవరి హయాంలో దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు?
ఎ) మింటో
బి) హార్డింజ్
సి) కర్జన్
డి) చెమ్స్‌ఫర్డ్
- View Answer
- సమాధానం: బి
52. జతపరచండి
ఎ. ఎం.ఎన్.రాయ్ | 1. హోంరూల్ ఉద్యమం |
బి. సి.ఆర్.దాస్ | 2. రాడికల్ నేషనల్ |
సి. అనిబిసెంట్ | 3. స్వరాజ్య పార్టీ |
డి. తిలక్ | 4. బెంగాల్ విభజన |
బి) ఎ-2, బి-3, సి-1, డి-4
సి) ఎ-2, బి-4, సి-1, డి-2
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
- View Answer
- సమాధానం: డి
53. కింద పేర్కొన్న విప్లవ వీరుల్లో విదేశాల్లో పనిచేయనివారు?
ఎ) హరదయాళ్
బి) మౌలానా బర్కతుల్లా
సి) చిదంబరం పిళ్లై
డి) రాజమహేంద్ర ప్రతాప్
- View Answer
- సమాధానం: సి
54. హోంరూల్ ఉద్యమంతో సంబంధం ఉన్న నాయకుడు?
ఎ) బాలగంగాధర్ తిలక్
బి) మహ్మద్ అలీ జిన్నా
సి) లార్డ్ మింటో
డి) వారన్ హేస్టింగ్స్
- View Answer
- సమాధానం: ఎ
55.బ్రిటిషర్లు కైజర్-ఇ-హింద్ అనే బిరుదును ఎవరికి ఇచ్చారు?
ఎ) తిలక్
బి) చంద్రపాల్
సి) సుబాష్ చంద్ర బోస్
డి) మహాత్మా గాంధీ
- View Answer
- సమాధానం: డి
56. కింది వాటిలో సరికాని జత
ఎ) న్యూ ఇండియా - బిపిన్ చంద్రపాల్
బి) మరాఠా - బాలగంగాధర్ తిలక్
సి) యుగాంతర - అరబింద ఘోష్
డి) స్వదేశ మిత్రన్ - జి. సుబ్రహ్మణ్య అయ్యర్
- View Answer
- సమాధానం: ఎ
57. జతపరచండి
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4 ఎ. సైమన్ కమిషన్ 1. 1885 బి. క్విట్ ఇండియా ఉద్యమం 2. 1942 సి. ఐఎన్‌సీ ఆవిర్భావం 3. 1927 డి. మింటో మార్లే సంస్కరణలు 4. 1909
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-4, బి-3, సి-1, డి-2
డి) ఎ-3, బి-2, సి-1, డి-4
- View Answer
- సమాధానం: డి
58. జతపరచండి
ఎ. స్వరాజ్యం నా జన్మహక్కు | 1. మహాత్మా గాంధీ |
బి. సమైక్య బెంగాల్ ఒక శక్తి | 2. జవహర్లాల్ నెహ్రూ |
సి. అస్పృశ్యత నేరం | 3. తిలక్ |
డి. చాలా సంవత్సరాలు విధితో సంఘర్షణ పడ్డాం | 4. జి.కె.గోఖలే |
5. రిప్లీ |
బి) ఎ-3, బి-5, సి-1, డి-2
సి) ఎ-3, బి-4, సి-1, డి-2
డి) ఎ-4, బి-2, సి-5, డి-3
- View Answer
- సమాధానం: సి
59. చౌరి చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 1920
బి) 1921
సి) 1922
డి) 1924
- View Answer
- సమాధానం: సి
60. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత?
ఎ) గాంధీజీ
బి) తిలక్
సి) దాదాబాయ్ నౌరోజి
డి) నెహ్రూ
- View Answer
- సమాధానం: సి
61. లండన్‌లో ఈస్టిండియా అసోసియేషన్‌ను స్థాపించినది?
ఎ) దాదాబాయ్ నౌరోజి
బి) గాంధీజీ
సి) ఆనందబోస్
డి) బెనర్జీ
- View Answer
- సమాధానం: ఎ
-
62. జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందు జరిగిన ఏ సంఘటన భారతీయుల్లో జాతి పరంగా ఏకం కావాలనే చైతన్యాన్ని అధికంగా కలిగించింది?
ఎ) ఇల్బర్ట్ బిల్లు వివాదం (1883)
బి) సివిల్ సర్వీసెస్ వయోపరిమితి తగ్గింపు (1866)
సి) ఆయుధ నియంత్రణ చట్టం (1878)
డి) ప్రాంతీయ భాషా పత్రికల చట్టం (1879)
- View Answer
- సమాధానం: ఎ
63. ‘ప్రాస్పరస్ బ్రిటిష్ ఇండియా’ గ్రంథ రచయిత ఎవరు?
ఎ) వెడ్డర్ బర్న్
బి) జార్జ్ యూల్
సి) విలియం డిగ్బీ
డి) ఎ.ఒ. హ్యూమ్
- View Answer
- సమాధానం: సి
64. జాతీయ కాంగ్రెస్‌కు పునాది వేసిన సంస్థగా కింది వాటిలో దేన్ని పేర్కొంటారు?
ఎ) ఇండియన్ అసోసియేషన్
బి) ఇండియన్ సొసైటీ
సి) ఈస్ట్ ఇండియా అసోసియేషన్
డి) ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్
- View Answer
- సమాధానం: డి
65. తొలిసారిగా భారత జాతీయ జెండా (ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగులతో కూడిన త్రివర్ణపతాకం)ను ఎగరవేసింది/ఆవిష్కరించింది ఎవరు?
ఎ) మేడం బికాజీకామా
బి) తారకానాథ్ దాస్
సి) రాస్ బిహారీ బోస్
డి) అనిబీసెంట్
- View Answer
- సమాధానం:ఎ
66. పారిశ్రామికీకరణ అధారంగా ఆర్థికాభివృద్ధి సాధించడానికి 1938లో ‘జాతీయ ప్రణాళికా కమిటీ’ని ఏర్పాటు చేసింది ఎవరు?
ఎ) రమేష్ చంద్రదత్
బి) సుభాష్ చంద్రబోస్
సి) మోతీలాల్ నెహ్రూ
డి) జవహర్లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: బి
67. జాతీయ కాంగ్రెస్ పరోక్ష సహకారంతో నిర్వహించిన ‘వైకోయం సత్యాగ్రహం’ దేనికి సంబంధించింది?
ఎ) నిమ్నజాతుల దేవాలయ ప్రవేశం
బి) భూమిశిస్తు తగ్గింపు
సి) వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా
డి) భూస్వాములకు వ్యతిరేకంగా
- View Answer
- సమాధానం:ఎ
68. బెర్కిలీ, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో సంస్కృత, వేదాంత ఆచార్యులుగా పనిచేసిన ప్రముఖ విప్లవాద నాయకుడెవరు?
ఎ) మోహన్ సింగ్
బి) లాలా హరదయాల్
సి) సాహన్సింగ్ బక్నా
డి) శ్యాంజీ కృష్ణవర్మ
- View Answer
- సమాధానం: బి
69. భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను తొలిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?
ఎ) 1862 కౌన్సిళ్ల చట్టం
బి) 1892 కౌన్సిళ్ల చట్టం
సి) 1919 భారత ప్రభుత్వ చట్టం
డి) 1935 భారత ప్రభుత్వ చట్టం
- View Answer
- సమాధానం: సి
70. మహాత్మాగాంధీ స్థాపించిన ‘హరిజన సేవక్ సంఘ్’కు తొలి అధ్యక్షులు ఎవరు?
ఎ) జి.డి. బిర్లా
బి) కె. కేలప్పన్
సి) బి.ఆర్. అంబేడ్కర్
డి) మహదేవ్ దేశాయ్
- View Answer
- సమాధానం: ఎ
71. బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో గదర్ పార్టీ ముఖ్య నాయకుడు ఎవరు?
ఎ) సూర్యసేన్
బి) శిశిర్ కుమార్ ఘోష్
సి) జతింద్రనాథ్ ముఖర్జీ
డి) రాస్ బిహారీ బోస్
- View Answer
- సమాధానం:సి
72.కిసాన్ సభ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు ఎవరు?
ఎ) స్వామి సహజానంద సరస్వతి
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) ఇందూలాల్ యాగ్నిక్
డి) భాయి పరమానంద
- View Answer
- సమాధానం: ఎ
73. లక్నో సదస్సు తర్వాత జాతీయ కాంగ్రెస్‌ను వీడిన మితవాద నాయకులు స్థాపించిన నూతన పార్టీ పేరేమిటి?
ఎ) సోషలిస్ట్ పార్టీ
బి) లిబరల్ పార్టీ (National Liberal Federation)
సి) స్వరాజ్య పార్టీ
డి) జాతీయ పార్టీ
- View Answer
- సమాధానం: బి
74.భారతదేశాన్ని తల్లిగా భావించి పూజించిన ప్రముఖ జాతీయ నాయకుడు ఎవరు?
ఎ) మహ మ్మద్ అలీ
బి) చిత్తరంజన్‌దాస్
సి) అరబిందో ఘోష్
డి) జతిన్‌దాస్
- View Answer
- సమాధానం: సి
75. మతపరంగా ప్రజలను ఏకం చేయడానికి బాలగంగాధర తిలక్ దేశవ్యాప్తంగా.. గణపతి, శివాజీ ఉత్సవాలను వరసగా ఏ సంవత్సరాల్లో ప్రారంభించారు?
ఎ) 1893, 1896
బి) 1880, 1881
సి) 1890, 1891
డి) 1885, 1886
- View Answer
- సమాధానం: ఎ
76. ‘కాంగ్రెస్’ అనే పదాన్ని దేని నుంచి గ్రహించారు?
ఎ) బ్రిటన్ పార్లమెంట్ సమావేశం
బి) అంతర్జాతీయ మత సమావేశం
సి) ఉత్తర అమెరికా చరిత్రలో ‘ప్రజా సమావేశం’ అనే పదం
డి) కార్మిక సంఘాల సమాఖ్య
- View Answer
- సమాధానం: సి
77. 1885లో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎంత మంది ప్రతినిధులు హాజరయ్యారు?
ఎ) 540
బి) 54
సి) 100
డి) 72
- View Answer
- సమాధానం: డి
78.1889లో భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన ‘బ్రిటిష్ కమిటీ’ని ఎవరి అధ్యక్షతన స్థాపించారు?
ఎ) విలియం వెడ్డర్ బర్న్
బి) మహమ్మద్ జిన్నా
సి) ఎ.ఒ. హ్యూమ్
డి) సురేంద్రనాథ్ బెనర్జీ
- View Answer
- సమాధానం: ఎ
79. జాతీయ కాంగ్రెస్‌ను ‘ఆయుధాలు ధరించని పౌర తిరుగుబాటు’గా అభివర్ణించింది ఎవరు?
ఎ) లార్డ్ క్రాస్
బి) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
సి) మౌలానా అబుల్ కలాం ఆజాద్
డి) లార్డ్ కర్జన్
- View Answer
- సమాధానం: బి
80.‘యురోపియన్స్ డిఫెన్స్ అసోసియేషన్’ సంస్థ ఏ కారణంగా ఇల్బర్ట్ బిల్లును రద్దు చేయాలని భారతదేశంలో పెద్ద ఎత్తున నిరసనోద్యమం నిర్వహించింది?
ఎ) యురోపియన్లకే ప్రథమ తరగతి ఉద్యోగాలు కల్పించాలని
బి) వైస్రాయ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రవేశం కల్పించకూడదని
సి) భారతీయ న్యాయమూర్తులకు యురోపియన్లను విచారించే అధికారం ఉండకూడదని
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
81. ‘బాంబే త్రిమూర్తులు’గా ఎవరిని పేర్కొంటారు?
ఎ) ఫిరోజ్ షా మెహతా, కె.టి. తెలాంగ్, బద్రుద్దీన్ త్యాబ్జి
బి) కె.టి.తెలాంగ్, బద్రుద్దీన్ త్యాబ్జి, ఎం.జి. రనడే
సి) బద్రుద్దీన్ త్యాబ్జి, తిలక్, అగార్కర్
డి) తిలక్, అగార్కర్, కె.టి. తెలాంగ్ s
- View Answer
- సమాధానం: ఎ
82. మితవాదులు.. బ్రిటిష్ ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించడానికి కింది వాటిలో ఏ పద్ధతిని ఎంచుకున్నారు?
ఎ) స్వదేశీ
బి) బహిష్కరణ
సి) ఎ, బి
డి) సత్యాగ్రహం
- View Answer
- సమాధానం: సి
83. కింద పేర్కొన్న వారిలో 1906లో ముస్లింలీగ్ స్థాపనతో సంబంధం ఉన్నవారెవరు?
ఎ) ఆగాఖాన్
బి) నవాబ్ సలీముల్లా
సి) నవాబ్ మొహిసిన్-ఉల్-ముల్క్
డి) పైన పేర్కొన్న వారందరూ
- View Answer
- సమాధానం: డి
84.1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన రోజును ‘రక్షాబంధన్ దినం’గా పాటించి బ్రిటిష్ ప్రభుత్వానికి నిరసన తెలపాలని పిలుపునిచ్చింది ఎవరు?
ఎ) దేవేంద్రనాథ్ ఠాగూర్
బి) రవీంద్రనాథ్ ఠాగూర్
సి) ప్రమోద్ మిత్రా
డి) స్వామి వివేకానంద
- View Answer
- సమాధానం: బి
85. ముస్లింలీగ్‌ను వ్యతిరేకించి, తీవ్రవాద జాతీయోద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన అహ్రార్ ఉద్యమ ప్రముఖులు ఎవరు?
ఎ) మౌలానా మహమ్మద్ అలీ
బి) హకీం హజ్మల్ ఖాన్
సి) హసన్ ఇమామ్
డి) పైన పేర్కొన్న వారందరూ
- View Answer
- సమాధానం: డి
86. గదర్ పార్టీ వర్గం 1915 ఫిబ్రవరి 21న ఏ ప్రాంతంలో సాయుధ తిరుగుబాటు చేయాలని నిర్ణయించింది?
ఎ) మధ్య భారతదేశం
బి) బెంగాల్
సి) పంజాబ్
డి) రాజస్థాన్
- View Answer
- సమాధానం: సి
87. 1916లో ముస్లింలీగ్, కాంగ్రెస్ మధ్య లక్నో ఒప్పందం జరగడానికి ప్రముఖపాత్ర పోషించింది ఎవరు?
ఎ) అనిబీసెంట్
బి) బాలగంగాధర్ తిలక్
సి) లాలా లజపతిరాయ్
డి) అంబికా చరణ్ మజుందార్
- View Answer
- సమాధానం: బి
88. గాంధీజీ దక్షిణాఫ్రికాలో నిర్వహించిన పత్రిక ఏది?
ఎ) హరిజన్
బి) నవజీవన్
సి) ఇండియన్ ఒపీనియన్
డి) యంగ్ ఇండియా
- View Answer
- సమాధానం: సి
89. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ప్రచారం చేసిన ఫిలిప్ స్ప్రాట్ ఏ దేశస్థుడు?
ఎ) రష్యా
బి) ఇంగ్లండ్
సి) జర్మనీ
డి) జపాన్
- View Answer
- సమాధానం: బి
90. ‘పాకిస్తాన్’ పద రూపకర్త ఎవరు?
ఎ) రహమత్ అలీ
బి) జిన్నా
సి) మహమ్మద్ ఇక్బాల్
డి) మహమ్మద్ అజం ఖాన్
- View Answer
- సమాధానం: ఎ
91. కింది వాటిలో గాంధీజీని ప్రభావితం చేసిన గ్రంథాలు ఏవి?
1) ది మదర్ - గోర్కి
2) సివిల్ డిస్ఒబీడియన్స్ - తోరో
3) భగవద్గీత
4) అన్టు దిస్ లాస్ట్ - జాన్ రస్కిన్
5) కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ఇన్ యూ - టాల్‌స్టాయ్
ఎ) 1, 2, 3
బి) 2, 3, 4
సి) 3, 4, 5
డి) 1, 2, 3, 4, 5
- View Answer
- సమాధానం: డి
92. రౌలత్ చట్టాలను కేంద్ర శాసనసభలో సమర్థించిన ఏకైక భారతీయుడు ఎవరు?
ఎ) శంకర్ నాయర్
బి) తేజ్‌బహదూర్ సప్రూ
సి) ఎం.ఆర్. జయకర్
డి) డాక్టర్ సత్యపాల్
- View Answer
- సమాధానం: ఎ
93.జతపరచండి. గ్రంథాలు రచయితలు
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e i)జాతీయ కాంగ్రెస్ చరిత్ర a) పట్టాభి సీతారామయ్య ii) ది నేషన్స్ వాయిస్ b) రాజగోపాలచారి iii) రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ఇండియా c) సి.ఎఫ్. ఆండ్రూఫ్ iv)లెటర్స్ ఫ్రమ్ రష్యా d) రవీంద్రనాథ్ ఠాగూర్ v) ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సర్వీస్ e) గోపాలకృష్ణ గోఖలే
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-d, 2-b, 3-c, 4-a, 5-e
డి) 1-a, 2-d, 3-c, 4-e, 5-b
- View Answer
- సమాధానం: ఎ
94. ‘భారతదేశాన్ని మరోసారి జయించాలి’ అని పేర్కొన్నవారెవరు?
ఎ) వివేకానంద
బి) బాలగంగాధర తిలక్
సి) దయానంద సరస్వతి
డి) భగత్ సింగ్
- View Answer
- సమాధానం: ఎ
95. మద్రాసు విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా పని చేసిన మొదటి భారతీయుడు, ‘దక్షిణ భారతదేశ కురువృద్ధుడు’గా గుర్తింపు పొందిన వారెవరు?
ఎ) జి. సుబ్రహ్మణ్య అయ్యర్
బి) ఎస్. సుబ్రహ్మణ్య అయ్యర్
సి) పెరియార్
డి) వీరేశలింగం పంతులు
- View Answer
- సమాధానం: బి
96. ‘మహారాష్ట్ర సోక్రటీస్’గా ఎవరిని పిలుస్తారు?
ఎ) ఫిరోజ్ షా మెహతా
బి) కె.టి. తెలాంగ్
సి) ఎం.జి. రనడే
డి) అగార్కర్
- View Answer
- సమాధానం: సి
97. బ్రిటిష్ పార్లమెంట్ ‘భారత స్వాతంత్య్ర చట్టం’ను ఆమోదించిన తేది?
ఎ) 1947 జూలై 18
బి) 1947 జూన్ 3
సి) 1947 జూలై 20
డి) 1947 ఆగస్టు 3
- View Answer
- సమాధానం: ఎ
98. ‘భారతదేశ పాలనకు ప్లాసీలో పునాది పడితే, అమృత్‌సర్‌లో బీటలు వారింది’ అని పేర్కొన్న నాయకుడు ఎవరు?
ఎ) మహాత్మా గాంధీ
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) సర్దార్ వల్లభాయ్ పటేల్
డి) సుభాష్ చంద్రబోస్
- View Answer
- సమాధానం: ఎ
99. భారత్‌లో ఆంగ్లవిద్యకు ‘మాగ్నాకార్టా’గా ఏ నివేదికను పేర్కొంటారు?
ఎ) హంటర్ నివేదిక
బి) మెకాలే నివేదిక
సి) ఉడ్ నివేదిక
డి) రీడ్ నివేదిక
- View Answer
- సమాధానం:సి
100. జలియన్ వాలాబాగ్ దురంతాల పరిశీలనకు బ్రిటిష్ ప్రభుత్వం ‘హంటర్ కమిషన్’ను నియమించగా, కాంగ్రెస్ ఒక స్వతంత్ర కమిటీని వేసింది. దీని కార్యదర్శి ఎవరు?
ఎ) కె. శాంతారాం
బి) జె.బి. కృపలాని
సి) యు.ఎన్. దేబర్
డి) నిజలింగప్ప
- View Answer
- సమాధానం:ఎ
101. కింద పేర్కొన్న ఏ సంవత్సరంలో కాంగ్రెస్ వార్షిక సమావేశాన్ని నిర్వహించలేదు?
ఎ) 1930
బి) 1935
సి) ఎ, బి
డి) 1947
- View Answer
- సమాధానం: సి
102. మహమ్మద్ అలీ జిన్నా ఏ సంవత్సరం నుంచి ముస్లింలీగ్‌కు శాశ్వత అధ్యక్షుడిగా నియమితులయ్యారు?
ఎ) 1936
బి) 1913
సి) 1930
డి) 1940
- View Answer
- సమాధానం: ఎ